గుడ్ న్యూస్... వీసా లేకుండా పాక్ వెళ్లే ఆప్షన్ ఎక్స్ టెన్షన్!
భారతీయులు ఎటువంటి వీసా అవసరం లేకుండానే పాకిస్థాన్ వెళ్లే ఓ అధికారిక ఆప్షన్ ఉందనే విషయం చాలా మందికి తెలియకపోవచ్చు
భారతీయులు ఎటువంటి వీసా అవసరం లేకుండానే పాకిస్థాన్ వెళ్లే ఓ అధికారిక ఆప్షన్ ఉందనే విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. ఈ ఆప్షన్ విషయంలో ఇరు దేశాలూ కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఇందులో భాగంగా... పాకిస్థాన్ లోని నరోవాల్ జిల్లాలో ఉన్న గురుద్వార్ దర్బార్ సాహిబ్ ను దర్శించుకునే విషయంలో ఆప్షన్ ను పొడిగించారు.
అవును... భారతీయులు ఎటువంటి వీసా అవసరం లేకుండా పాక్ కు వెళ్లే ఆప్షన్ విషయంలో ఇరు దేశాలూ కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఇందులో భాగంగా... కర్తార్ పుర్ కారిడర్ పై ఉన్న ఒప్పందాన్ని మరో ఐదేళ్ల పాటు పొడిగించేందుకు అంగీకరించినట్లు ఇరు దేశాలు ప్రకటించాయి. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.
ఇదే సమయంలో... ఈ నడకను ఉపయోగించుకుంటున్న భక్తులు ఒక్కొక్కరి నుంచి వస్తూలు చేస్తోన్న 20 డాలర్ల సర్వీస్ రుసుము విషయంలోనూ భారత్ ఓ విజ్ఞప్తి చేసింది! ఇందులో భాగంగా... ఇకపై భక్తులపై ఎలాంటి రుసుము విధించవద్దని కోరినట్లు పేర్కొంది. ఈ నిర్ణయం పట్ల భక్తులు నిరంతరాయంగా ఈ కారిడార్ ను ఉపయోగించుకునేందుకు వీలుకలగనుంది!
కాగా... భారత్ లోని డేరా బాబా నానక్ నుంచి పాకిస్థాన్ లోని నరోవాల్ జిల్లాల్లో ఉన్న గురుద్వారా దర్బార్ సాహిబ్ ను కలుపుతూ ఓ కారిడార్ ను నిర్మించారు. దీన్ని 2019 నవంబర్ 19న గురునానక్ 550 జయంతి సందర్భంగా ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ సమయంలో ఐదేళ్ల పాటు ఈ కరిడార్ పై భారత్-పాక్ లు ఒప్పందం కుదుర్చుకున్నాయి.
సిక్కుల గురువు గురునానక్ తన చివరి రోజుల్లో ఇక్కడే నివసించారు. దీంతో... ఈ ప్రాంతాన్ని సిక్కులు చాలా పవిత్రంగా భావిస్తారు. ఇక్కడికి భారతీయులు ఎటువంటి వీసా లేకుండానే వెళ్లేలా ఇరు దేశాల మధ్య ఒప్పందం ఉంది. అయితే.. ఆ ఒప్పందం ముగియనుండటంతో.. ఆ కాలపరిమితిని పెంచుతూ ఇరుదేశాలూ ఒప్పందానికి వచ్చాయి.