'లంచం అవాస్తవం.. వేరే ఆరోపణలు ఉన్నాయి'... అదానీ సంస్థ క్లారిటీ!

అదానీ గ్రూపు సంస్థల ఛైర్మన్ అదానీ తో పాటు ఎనిమిది మందిపై అమెరికాలో అభియోగాలు నమోదయ్యాయనే విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే

Update: 2024-11-27 06:14 GMT

అదానీ గ్రూపు సంస్థల ఛైర్మన్ అదానీ తో పాటు ఎనిమిది మందిపై అమెరికాలో అభియోగాలు నమోదయ్యాయనే విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే! సోలార్ ఎనర్జీ ఒప్పందాలు పొందేందుకు భారత ప్రభుత్వ అధికారులకు పెద్ద ఎత్తున లంచాలు ఆఫర్ చేశారన్న ఆరోపణలపై అమెరికాలో కేసు నమోదయ్యింది.

దీంతో... అదిగో వారికి ఇంత లంచం ఇచ్చారు.. అదిగో వారికి అంత లంచం ఇచ్చారంటూ కథనాలు విచ్చలవిడిగా ప్రవహించాయని అంటున్నారు! ఈ నేపథ్యంలో తాజాగా అదానీ గ్రూపుకు చెందిన గ్రీన్ ఎనర్జీ సంస్థ ఓ కీలక ప్రకటన చేసింది. ఇందులో భాగంగా... లంచం అభియోగాలపై వస్తున్న వార్తలు అవాస్తవమని వెల్లడించింది.

అవును... భారత ప్రభుత్వ అధికారులకు పెద్ద ఎత్తున లంచాలు ఆఫర్ చేశారనే అభియోగాలు తీవ్ర సంచలనంగా మారిన వేళ అదానీ గ్రీన్ ఎనర్జీ సంస్థ స్పందించింది. ఇందులో భాగంగా... ఈ కేసుకు సంబంధించి గౌతమ్ అదానీ, ఆయన బంధువు సాగర్ అదానీలపై లంచం అభియోగాలు నమోదైనట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని వెల్లడించింది.

స్టాక్ ఎక్స్చేంజ్ ఫైలింగ్ సందర్భంగా దీనిపై స్పందించిన అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్... అమెరికా ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ (ఎఫ్.సీ.పీ.ఏ) కింద గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, కంపెనీ సీనియర్ డైరెక్టర్ వినీత్ జైన్ పై లంచం, అవినీతి అభియోగాలు నమోదైనట్లు వచ్చిన కథనాలు అన్నీ అవాస్తవం అని తెలిపింది.

ఇదే సమయంలో... వీరింత సెక్యూరిటీస్ కి సంబంధించిన మోసం ఆరోపణలు ఎదుర్కొంటున్నారే తప్ప.. వారిపై లంచం, అవినీతికి సంబంధించిన అభియోగాలు ఏమీ నమోదు కాలేదని స్పష్టం చేసింది.

Tags:    

Similar News