రేవంత్ రెడ్డీ.. బాబుని కాపీ కొట్టవద్దు...సెకండ్ టైం కష్టం !
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఈ మధ్య తెలంగాణాలో అంతా చంద్రబాబుని కాపీ కొడుతున్నారు అని అంటున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఈ మధ్య తెలంగాణాలో అంతా చంద్రబాబుని కాపీ కొడుతున్నారు అని అంటున్నారు. అందుకే సగం సగం పనులు చేస్తున్నారు అని కూడా అంటున్నారు. రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన రైతు రుణ మాఫీ కూడా ఇంకా పూర్తి కాలేదు.
అదే విధంగా కాంగ్రెస్ పార్టీని పెద్ద ఎత్తున గెలిపించిన రూరల్ సెక్టార్ లో రేంత్ రెడ్డి పాలన మార్క్ ఏదీ ఇప్పటిదాకా లేనే లేదు అని అంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు ఎంత అరచినా అవి బాగానే ఉంటాయి కానీ అధికారంలోకి వచ్చిన తరువాత చెప్పిన వాటిని చేయకపోతే మాత్రం అసలుకే మోసం వస్తుందని అంటున్నారు.
ఇక చూస్తే చంద్రబాబు కూడా విపక్షంలో ఉన్నపుడు ఎన్నో హామీలు ఆర్భాటంగా ఇస్తారని గుర్తు చేస్తున్నారు. అధికారంలోకి వస్తే మాత్రం తన అనుకూల పత్రికలలో అవి అమలు చేయడం కష్టం, డబ్బులు లేవు అంటూ వాటిని పక్కన పెట్టేస్తారు అని కూడా విమర్శిస్తూంటారు.
ఈ రకంగా చేయడం వల్లనే చంద్రబాబు ఎపుడూ రెండవ సారి వరసగా గెలిచిన దాఖలాలు లేవని అంటూంటారు. ఇక చూస్తే రేవంత్ రెడ్డి జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ కి సంబంధించిన సీఎం. చంద్రబాబులా ఆయనకు సొంత పార్టీ లేదు. కాంగ్రెస్ అంటేనే ఎంతో మంది నాయకులు ఉంటారు. అందరూ సీఎం సీటు కోసం ఆశగా చూస్తూంటారు.
ఇక అధినాయకత్వం దయ ప్రాప్తం ఎంతకాలం ఉంటే అంతకాలమే కుర్చీ ఉంటుంది అన్నది వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే రేవంత్ రెడ్డి అదృష్టం ఏమిటి అంటే ఈ మధ్య దేశంలో ఎన్నికలు జరిగే ప్రతీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలు అవుతోంది.
దాంతో కాంగ్రెస్ పెద్దలు కూడా తమకు ఉన్నవే తక్కువ రాష్ట్రాలని భావిస్తున్నారు. అలా ఉన్న రాష్ట్రాలలో ఎందుకు అనవసరంగా సీఎంలను మార్చి డిస్టర్బ్ చేసుకోవడం అని కూడా సర్ది చెప్పుకుంటున్నారు. అదే ఇపుడు రేవంత్ రెడ్డికి ప్లస్ పాయింట్ గా మారబోతోంది అని అంటున్నారు
ఈ విధంగా హై కమాండ్ ఆలోచనలు ఉండబట్టే రేవంత్ రెడ్డికి ఇపుడు ఫుల్ రిలీఫ్ గా ఉందని అంటున్నారు. ఇక రేవంత్ రెడ్డి విషయానికి వస్తే ఆయన బీజేపీ హైకమాండ్ తో పాటు టీడీపీ హై కమాండ్ కి కూడా పూర్తిగా టచ్ లో ఉన్నారని ప్రచారం అయితే సాగుతోంది.
దీంతో ఆయన ఈ విధంగా వ్యవహరించడం కాంగ్రెస్ వాదులకు ఎంత మాత్రం నచ్చడం లేదు అని అంటున్నారు. ఇక బీజేపీ పెద్దలను కలవడం వెనక తెలంగాణా రాష్ట్రానికి వచ్చే నిధుల కోసమే అని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. అయితే ఈ మాటలను కూడా కాంగ్రెస్ వర్గాలు నమ్మడం లేదు అని అంటున్నారు.
పక్కనే ఉన్న మరో కాంగ్రెస్ సీఎం కర్ణాటకకు చెందిన సిద్ధరామయ్య తరచూ బీజేపీ పెద్దలను ఎందుకు కలవడం లేదని కూడా అంటున్నారు. ఇక చూస్తే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో తన హవా చూపిస్తున్నారు అని సీనియర్లు కొందరు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఆయన తనదైన పాలన చేస్తున్నారు కానీ కాంగ్రెస్ వాదులను పూర్తిగా కలుపుకుని పోవడం లేదు అని అంటున్నారు.
ఇక దైనందిన రాజకీయ జీవితంలో బీఆర్ఎస్ నేతల మీద విమర్శలు చేస్తూ పొద్దు పుచ్చుతున్నారు తప్ప విపక్షం చేసే విమర్శలలో సారాన్ని గ్రహించి దాని మీద పాలనలో ఏమైనా తప్పులు ఉంటే సరిదిద్దుకోవాలని చూడడం లేదని అంటున్నారు. తెలంగాణా రాజకీయాల్లో బీఆర్ఎస్ పని అయిపోయిందని ఇక పోటీగా కాంగ్రెస్ లోనూ బయటా ఎవరూ లేరని భావించినా తప్పే అని అంటున్నారు
ఏది ఏమైనా రేవంత్ రెడ్డిలో ఆత్మ విశ్వాసం పెరిగిందా అతి విశ్వాసంగా మారుతోందా అన్నది కూడా చర్చగా ఉంది. ఆయనకు మాటకారితనం ఉండడం ఒక బలం. అయితే అది ప్రతిపక్షంలో పనికి వస్తుంది కానీ సీఎం గా మాటల కంటే చేతలకే ఎక్కువ విలువ అని గ్రహించాలని అంటున్నారు. మొత్తానికి ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న రేవంత్ రెడ్డి తన తీరుని పాలనలో వైఖరులను మార్చుకోవాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ వాదులు అంటున్నారు. చూడాలి మరి రేవంత్ రెడ్డి బాబు బాటలో నడుస్తారా లేక కాంగ్రెస్ బాటలో సాగుతారా అన్నది అని అంటున్నారు.