బీఆరెస్స్ లో చేరిన కాసాని.ఈటలపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు!

అవును... అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తోన్న వేళ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.

Update: 2023-11-03 10:04 GMT

అనుకున్నదే అయ్యింది! తెలంగాణ ఎన్నికల్లో పోటీచేయకూడదని టీడీపీ అధినేత చంద్రబాబు తీసుకున్న నిర్ణయం అనైతికం అని.. పార్టీ నేతలను గొంతు కోయడం అని, కార్యకర్తలను లోపాయకరిగా తాకట్టుపెట్టడం అని తీవ్ర స్థాయిలో ఫైరయిన కాసాని జ్ఞానేశ్వర్ టి.టీడీపీ చీఫ్ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఏపీలో ఎన్నికల కోసం తెలంగాణలో పార్టీని బలిచేస్తున్నారని ఆయన కామెంట్ చేశారు! ఈ క్రమంలో తాజాగా కాసాని కారెక్కారు!

అవును... అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తోన్న వేళ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా... టీటీడీపీ మాజీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ బీఆరెస్స్ పార్టీలో చేరారు. శుక్రవారం ఎర్రవల్లిలోని సీఎం ఫాం హౌస్‌ లో కాసాని జ్ఞానేశ్వర్ కి కండువా కప్పిన సీఎం కేసీఆర్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. దీంతో ముదిరాజ్ సామాజికవర్గం లక్ష్యంగా బీఆరెస్స్ కదుపుతున్న పావుల్లో ఇదొక కీలక అడుగు అని అంటున్నారు.

ఈ సందర్భంగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారడమే కాకుండా.. బీఆరెస్స్ లో ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన బలమైన నేత లేరనే లోటుకు ఈ మాటలు బలం చేకూరుస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు. కాసానికి కండువా కప్పి కారెక్కించుకున్న అనంతరం స్పందించిన కేసీఆర్... ఈ విషయాలనే స్పష్టం చేశారు. ఇందులో భాగంగా తెరపైకి ఈటల రాజేందర్ ని తెరపైకి తెచ్చారు.

ఇందులో భాగంగా... ఈ సందర్భంగా మాట్లాడిన కేసీఆర్... బీఆరెస్స్ నుండి బయటకు వెళ్లిపోయిన ఈటల రాజేందర్ కంటే పెద్దమనిషి కాసాని జ్ఞానేశ్వర్ పార్టీలోకి వచ్చారని అన్నారు. ఈ సందర్భంగా... బీఆరెస్స్ లో ముదిరాజ్ లను ఈటల రాజేందర్ అస్సలు ఎదగనివ్వలేదని కేసీఆర్ మండిపడ్డారు. అనంతరం... నామినేటెడ్ పదవుల్లో ముదిరాజ్‌ లకు పెద్ద పీట వేస్తామని ఈ సందర్భంగా కేసీఆర్ హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా రాబోయే రోజుల్లో బీఆరెస్స్ లో ముదిరాజ్‌ లకు ఎమ్మెల్సీ, రాజ్యసభ సభ్యుల పదవులు దక్కుతాయని కేసీఆర్ తెలిపారు. ఇందులో భాగంగా... బండ ప్రకాష్ ముదిరాజ్‌ ను తీసుకువచ్చి పదవి ఇచ్చామని కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇదే క్రమంలో... ఎన్నికల తర్వాత ముదిరాజ్‌ లతో ప్రత్యేకంగా సమావేశమవుతానని కేసీఆర్ పేర్కొన్నారు.

ఆ సంగతి అలా ఉంటే... ఇప్పుడు కాసాని ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా, రేపు ఎమ్మెల్సీ ఇస్తారా అనేది ఆసక్తిగా మారింది. అయితే... తెలంగాణలో ముదిరాజ్ సామాజికవర్గానికి సుమారు 50లక్షల ఓట్లు ఉన్నాయని చెబుతున్నారు. దీంతో... హైదరాబాద్ లో కాసానిని రంగంలోకి దింపాలని కేసీఆర్ భావిస్తున్నారని సమాచారం. ఇందులో భాగంగా... కాసాని జ్ఞానేశ్వర్‌ కు గోషామహల్ టికెట్ ఇచ్చేదిశగా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం!

కాగా... తెలంగాణ టీడీపీ చీఫ్‌ గా కాసాని జ్ఞానేశ్వర్ ఇటీవలే ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి టీడీపీ దూరం అంటూ ఆ పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకోవడంతో కాసాని తీవ్ర స్థాయిలో అసంతృప్తికి గురయ్యారు. ఈ నేపథ్యంలోనే టీడీపీకి బై బై చెప్పి తాజాగా గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.

Tags:    

Similar News