అజ్ఞాత వాసాన్ని వీడనున్న కేసీఆర్.. త్వరలో అమెరికా టూర్

బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాస్ పోర్టు రెన్యువల్ చేసుకోవడం వెనుక ఆయన మనవడు హిమాన్షు ఉన్నాడని ప్రచారం జరుగుతోంది.

Update: 2025-02-19 14:30 GMT

బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాస్ పోర్టు రెన్యువల్ చేసుకోవడం వెనుక ఆయన మనవడు హిమాన్షు ఉన్నాడని ప్రచారం జరుగుతోంది. చాలాకాలంగా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఉంటున్న కేసీఆర్ ను అమెరికా రమ్మంటూ హిమాన్షు కోరడంతో ఆయన తన పాస్ పోర్టు రెన్యువల్ చేసుకోవాల్సివచ్చిందని చెబుతున్నారు. మనవడి కోరిక మేరకు తొలిసారి అమెరికాలో అడుగుపెడుతున్న గులాబీ బాస్.. అక్కడ తెలంగాణకు చెందిన ఎన్ఆర్ఐలతో ప్రత్యేకంగా సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. దాదాపు రెండు నెలలు కేసీఆర్ విదేశీ పర్యటన ఉంటుందని గులాబీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

కేసీఆర్ అమెరికా పర్యటనపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి కనిపిస్తోంది. రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి దాదాపు దశాబ్దకాలం అధికారంలో ఉన్న కేసీఆర్ కేవలం రెండు సార్లు మాత్రమే విదేశీ పర్యటనకు వెళ్లారు. సీఎం హోదాలో ఓ సారి సింగాపూర్, మరోసారు చైనాలో కేసీఆర్ పర్యటించారు. ఇక ఇప్పుడు లైఫ్‌లో ఫస్ట్‌ టైం అమెరికాకు కేసీఆర్ వెళ్లనున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దాదాపు 14 నెలలగా ఫామ్ హౌజ్ కే పరిమితమైన కేసీఆర్.. ఉన్నట్లుండి అమెరికాకు వెళ్లడం పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.

తన మనవడి కోరిక కాదనలేక కేసీఆర్ ఫామ్ హౌన్ లో అజ్ఞాత వాసాన్ని వీడుతున్నారని అంటున్నారు. కేటీఆర్ కుమారుడు హిమాన్షు ఉన్నత చదువులు నిమిత్తం ప్రస్తుతం అమెరికాలోనే ఉంటున్నారు. కేసీఆర్‌కు హిమన్షుతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. మరోవైపు అమెరికా తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం సైతం కేసీఆర్ ను అమెరికాకు అహ్వానించింది. ఈ మధ్యే ఎర్రవెల్లిలో కేసీఆర్ ను కలిసి ఫోరం చైర్మెన్ లక్ష్మణ్ తో కూడిన 15 మంది సభ్యుల బృందం కేసీఆర్ అమెరికా రావాలని కోరారు. దీంతో అజ్ఞాత వాసాన్ని వీడి అమెరికాలో అడుగుపెట్టాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారని చెబుతున్నారు. ఏప్రిల్ 27 పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాటికి రాష్ట్రానికి తిరిగి వచ్చేలా అమెరికా టూర్ ప్లాన్ చేయాలని ఆయన పార్టీ వర్గాలను ఆదేశించినట్లు చెబుతున్నారు. కేసీఆర్ ఎప్పుడు అమెరికా వెళ్లేది త్వరలోనే ప్రకటిస్తామని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

Tags:    

Similar News