కేసీయార్ నోరిప్పటం లేదే!

బహిరంగసభల్లో కేసీయార్ కాంగ్రెస్ ను, కాంగ్రెస్ సభలు, రోడ్డుషోల్లో కేసీయార్ తో పాటు ఆయన ఫ్యామిలీని టార్గెట్ చేసుకుని ఆరోపణలు, విమర్శలతో హోరెత్తించేస్తున్నారు. ఇదంతా బాగానే ది కానీ తనను ఉద్దేశించి నరేంద్రమోడీ ఈమధ్యనే చేసిన ఆరోపణపై మాత్రం కేసీయార్ నోరిప్పటంలేదు.

Update: 2023-10-30 14:30 GMT

తెలంగాణా ఎన్నికల ప్రచార సభలతో రాజకీయాలు బాగా వేడెక్కిపోయాయి. ఒకవైపు రోజుకు మూడు నియోజకవర్గాల్లో బహిరంగసభలతో కేసీయార్ దూసుకుపోతున్నారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ కు ధీటుగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ అగ్రనేతలు కూడా బహిరంగసభలు, రోడ్డుషోల్లో బిజీగా ఉంటున్నారు. కర్నాటక ఉపముఖ్యమంత్రి, అక్కడి పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఇన్చార్జిగా బాధ్యతలు తీసుకున్నారు. ఆదివారం నాటి రోడ్డుషోల్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా పాల్గొన్నారు.

బహిరంగసభల్లో కేసీయార్ కాంగ్రెస్ ను, కాంగ్రెస్ సభలు, రోడ్డుషోల్లో కేసీయార్ తో పాటు ఆయన ఫ్యామిలీని టార్గెట్ చేసుకుని ఆరోపణలు, విమర్శలతో హోరెత్తించేస్తున్నారు. ఇదంతా బాగానే ది కానీ తనను ఉద్దేశించి నరేంద్రమోడీ ఈమధ్యనే చేసిన ఆరోపణపై మాత్రం కేసీయార్ నోరిప్పటంలేదు. ఎన్డీయేలో చేరుతానని కేసీయార్ తనను బతిమాలడుకున్నా వద్దని చెప్పానని మోడీ ఒక బహిరంగసభలో చెప్పారు. ఎన్డీయేలో చేరేందుకు తాను మోడీని బతిమలాడుకున్నది నిజమా కాదా అన్న విషయంలో కేసీయార్ నోరిప్పటంలేదు.

మామూలుగా అయితే మోడీ చెప్పింది అబద్ధం అయితే ఈ పాటికే కేసీయార్ ఆకాశమంత ఎత్తున ఎగిరెగిరి పడేవారే. అలాంటిది మోడీ విషయం చెప్పి ఇన్నిరోజులైనా కేసీయార్ నోరిప్పటంలేదంటే అది నిజమే అని జనాలు అనుకుంటున్నారు. ఇందుకనే బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అని కాంగ్రెస్ నేతలు పదేపదే ఎటాక్ చేస్తున్నారు. కాంగ్రెస్ ఆరోపణలతో జనాలు కూడా కన్వీన్స్ అవుతున్నారు.

ఇదే సమయంలో మేడిగడ్డ బ్యారేజి డ్యామేజీపైనా కేసీయార్ నోరిప్పటంలేదు. నదిలో కింద ఇసుక పక్కకుపోవటంతోనే బ్యారేజి పిల్లర్ కుంగటంతో బ్యారేజి కూడా కుంగిందని ఇంజనీర్ ఇన్ చీఫ్ విచిత్రమైన వివరణిచ్చారు. ఇదే నిజమైతే నదిలో ఇసుక పక్కకు పోతునే ఉంటుంది. రేపటిరోజున భారీవర్షాలు కురిసినపుడు నదిలో ఇసుక కొట్టుకుపోతే అప్పుడు అన్నీ పిల్లర్లు కుంగిపోతాయన్నది వాస్తవం. అప్పుడు బ్యారేజీ కూలిపోకుండా ఉంటుందా ? అనే ప్రశ్నకు కేసీయార్ సమాధానం చెప్పలేకపోతున్నారు. అందుకనే ఈ విషయంలో కూడా ఎక్కడా నోరిప్పటంలేదు. కేసీయార్ నోరిప్పకపోయినా జనాలు ఆలోచించకుండానే ఉంటారా ?

Tags:    

Similar News