కేసీయార్ హ్యాట్రిక్ కొడతారు....జనతా కా మూడ్ సర్వే
తెలంగాణా ఎన్నికలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. సరిగ్గా ముప్పయి రోజుల వ్యవధిలో జనం తమ తీర్పుని వెలువరించనున్నారు.
తెలంగాణా ఎన్నికలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. సరిగ్గా ముప్పయి రోజుల వ్యవధిలో జనం తమ తీర్పుని వెలువరించనున్నారు. ఈ క్రమంలో మరో సర్వే ఇపుడు సంచలనంగా మారింది. ఈసారి తెలంగాణాలో ఎవరు అధికారంలోకి వస్తారు అన్న దాని మీద జనతా కా మూడ్ అన్న ససంస్థ చసిన సర్వేలో కేసీయార్ నాయకత్వంలోని బీయారెస్ మరోసారి అధికారంలోకి వస్తుందని తేలింది.
ఈ సర్వే వివరాలను నిర్వాహకులు మీడియా ముందు ఉంచారు. ఈ సర్వే ప్రకారం చూస్తే బీయరెస్ కి 72 నుంచి 75 వరకూ సీట్లు ఖాయంగా వస్తాయని చెబుతున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అయితే 31 నుంచి 36 దాకా సీట్లు సాధిస్తుందని సర్వే వెల్లడించింది. బీజేపీ మాత్రం ఏడు నుంచి తొమ్మిది దాకా సీట్లు సాధించే వీలుందని జనతా కా మూడ్ సర్వే పేర్కొంది.
ఇక మజ్లీస్ విషయానికి వస్తే నాలుగు నుంచి ఆరు సీట్లు వస్తాయని వెల్లడించింది. ఓట్ల షేర్ ని కూడా జనతా కా మూడ్ సంస్థ తెలియజేసింది. దాని ప్రకారం చూస్తే బీయారెస్ కి 41 శాతం, కాంగ్రెస్ కి 34 శాతం, బీజేపీకి 14 శాతం, ఎంఐఎం కి మూడు శాతం ఓట్లు వస్తాయని వివరించింది.
దీని ప్రకారం చూస్తే మళ్లీ బీయారెస్ గెలుస్తుందని జనతా కా మూడ్ సర్వే పక్కాగా తేల్చేసింది అన్న మాట. అదే సమయంలో తెలంగాణాలో మూడవసారి వరసగా ముఖ్యమంత్రిగా కేసీయార్ ప్రమాణం చేసి రికార్డు క్రియేట్ చేస్తారని ఈ సర్వే పేర్కొంది.
ఇక తమదే అధికారం అని గట్టిగా చెబుతున్న కాంగ్రెస్ కి పెరిగిన గ్రాఫ్ చూస్తే 36 సీట్ల దాకా మాత్రమే వస్తాయని జనతా కా మూడ్ అంటోంది. గత ఎన్నికల్లో 19 సీట్లు వచ్చిన కాంగ్రెస్ ఈసారి 36 దాకా చేరుకుంటుంది అంటే రెట్టింపు బలం సమకూర్చుకుంటుంది తప్ప అధికారంలోకి రాదు అని సర్వే తేల్చేస్తోంది.
బీయారెస్ మాటకు వస్తే గతసారి 88 సీట్లు సాధించింది. ఈసారి అందులో నుంచి 13 సీట్లను కోల్పోతుంది అని పేర్కొంది. అయినా సరే అధికారాన్ని నిలబెట్టుకుంటుందని కూడా స్పష్టం చేసింది. బీజేపీ డబుల్ డిజిట్ అని అనుకుంటోంది కానీ సింగిల్ డిజిట్ కే పరిమితం అని అది కూడా ఏడు నుంచి తొమ్మిది సీట్ల లోపు అని పేర్కొంటోంది.
అయితే 2018తో పోలిస్తే బీజేపీ ఓట్లూ సీట్లూ పెరగబోతున్నాయి అన్నది వివరించింది. ఇక మజ్లీస్ పార్టీ గురించి ఆలోచిస్తే ఆ పార్టీ కి ఎపుడూ ఏడుకు తక్కువ కాకుండా సీట్లు వస్తాయి కానీ ఈసారి నాలుగు నుంచి ఆరు సీట్లే అంటున్నారు. దీని బట్టి చూస్తే మజ్లీస్ నష్టపోతుందని సర్వే చెబుతోంది అని అంటున్నారు.
ఓవరాల్ గా చూసినపుడు కేసీయారే ముఖ్యమంత్రి అని జనతా కా మూడ్ సర్వే చెప్పేసింది. ఇక ఈ సర్వేనూ తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్ష 20 వేల శాంపిళ్లను తీసుకుని సర్వే చేసినట్టు వెల్లడించింది. దీనికి ముందు వచ్చిన శ్రీ ఆత్మ సాక్షి, అలాగే మిషన్ చాణక్య వంటి సంస్థల సర్వేలు కూడా బీయారెస్ దే విజయం అని అంటున్నాయి. మరి బీయారెస్ కూడా ఒక వైపు ధీమా వ్యక్తం చేస్తూనే మరో వైపు రాజశ్యామల యాగాన్ని కూడా చేస్తోంది. చూడాలి మరి ఈ సర్వేలలో ఏది నిజం అవుతుందో ఏమో అన్నది.