బీఆర్ఎస్ లో ఆ 'ముఖ్య' నేత ఎవరు ?
అయితే బీఆర్ఎస్ ఎల్పీగా ఎన్నికయ్యే కొత్త నేత ఎవరనే విషయమే ఇపుడు సస్పెన్సుగా మారింది. ఈనెల 9వ తేదీన ఎంఎల్ఏలు, సీనియర్ నేతలతో కేసీయార్ సమావేశం అవబోతున్నట్లు సమాచారం.
తొందరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మొదలవ్వబోతున్నాయి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని ఫైనల్ చేయబోతున్నారు. ముఖ్యమంత్రి కాబట్టి రేవంతే అసెంబ్లీలో సీఎల్పీ నేత. మరి ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ఎల్పీ నేతగా ఎవరుంటారు ? అసెంబ్లీ సమావేశాలకు కేసీయార్ హాజరయ్యేది అనుమానమనే ప్రచారం బాగా పెరిగిపోతోంది. మామూలుగా అయితే బీఆర్ఎస్ లెల్పీ నేతగా కేసీయారే ఉండాలి. కానీ ఇక్కడ ప్రత్యేక పరిస్ధితుల కారణంగా అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ గా వేరెవరినైనా కేసీయార్ నియమిస్తారని అనుకుంటున్నారు.
అయితే బీఆర్ఎస్ ఎల్పీగా ఎన్నికయ్యే కొత్త నేత ఎవరనే విషయమే ఇపుడు సస్పెన్సుగా మారింది. ఈనెల 9వ తేదీన ఎంఎల్ఏలు, సీనియర్ నేతలతో కేసీయార్ సమావేశం అవబోతున్నట్లు సమాచారం. ఆ సమావేశంలోనే బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతను కేసీయార్ ప్రకటిస్తారని పార్టీలో టాక్ పెరిగిపోతోంది. కొడుకు, మాజీ మంత్రి కేటాయర్ ఫ్లోర్ లీడర్ అవుతారని కొందరు చెప్పుకుంటున్నారు. ఇదే సమయంలో మేనల్లుడు, మాజీ మంత్రి హరీష్ రావుకు పగ్గాలు అప్పగిస్తారనే టాక్ కూడా ఉంది.
అసెంబ్లీలో బీఆర్ఎస్ నేతగా ఎవరున్నా ఘర్షణవాతావరణం అయితే తప్పదనే అనుమానిస్తున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు కొందరిని పనిగట్టుకుని కేసీయార్ అండ్ కో కావాలనే అవమానించారు. గతంలో రేవంత్ సభలో ఉన్నపుడు బీఆర్ఎస్ ఎంత టార్గెట్ చేసిందో అందరు చూసిందే. నియమాలకు విరుద్ధంగా రేవంత్ ను సభలో నుండి స్పీకర్ సస్పెండ్ చేశారు. కేసీయార్ ఆదేశాల ప్రకారమే స్పీకర్ నిర్ణయం తీసుకున్నారనే ఆరోపణలు అందరికీ తెలిసిందే.
అలాంటి రీవెంజ్ పాలిటిక్స్ ఇపుడు సభలో మళ్ళీమొదలవుతాయన్న ఆందోళనతోనే కేసీయార్ అసలు అసెంబ్లీకి రారనే ప్రచారం పెరిగిపోతోంది. కేసీయార్ స్ధానంలో కేటీయార్ అయినా పరిస్ధితిలో పెద్దగా మార్పుండదని అనుకుంటున్నారు. అందుకనే హరీష్ కు కూడా ఛాన్సుందనే ప్రచారం మొదలైంది. మరి 9వ తేదీన ఎంఎల్ఏల సమావేశంలో కేసీయార్ ఏమి చర్చిస్తారు ? ఎలాంటి నిర్ణయాలను ప్రకటిస్తారనే విషయంలో ఆసక్తి పెరిగిపోతోంది. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.