కేసీఆర్.... కాంగ్రెస్‌ను గెలిపిస్తారా?
ఇది కోరి తెచ్చుకున్నదా.. రాజకీయంగా జరిగిందా? అనేది పక్కన పెడితే.. బీఆర్ ఎస్‌కు ఇబ్బందులు తప్పడం లేదు.
రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. ఎప్పుడు ఏ విషయమైనా.. తెరమీదికి రావొచ్చు. ప్రత్యర్థుల ఎత్తుగడలను బట్టి.. పార్టీలు అడుగులు వేస్తుంటాయి. ఇదే అసలైన రాజకీయం. ప్రస్తుతం తెలంగాణలోనూ ఇదే జరుగు తోందని పరిశీలకులు భావిస్తున్నారు. తెలంగాణలో గత ఏడాది వరకు అధికారంలో ఉన్న బీఆర్ ఎస్ పార్టీ.. ఇప్పుడు కుదేలైంది. ఆ పార్టీకి తీవ్ర ఇబ్బందుల్లో కూడా ఉంది. ఇది కోరి తెచ్చుకున్నదా.. రాజకీయంగా జరిగిందా? అనేది పక్కన పెడితే.. బీఆర్ ఎస్‌కు ఇబ్బందులు తప్పడం లేదు.
అయితే.. ఈ ఇబ్బందుల వెనుక.. ఉన్న రాజకీయ వ్యూహాన్ని బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ గుర్తించినట్టు తెలుస్తోంది. దీంతో ఆయన తాను ఇబ్బంది పడినా.. పూర్తిగా మునిగిపోయే పరిస్థితి రాకుండా చూసుకునే ప్రయత్నంలో ముమ్మర యత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. విషయం ఏంటంటే.. కేంద్రంలోని బీజేపీ నాయకులు.. దక్షిణాదిపై దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. కర్ణాటక వారికి ఫేవర్‌గా ఉంది. ఇక, ఏపీ, తమిళనాడు, కేరళలను చూసుకుంటే.. ఇక్కడ కమల వికాసం లేనట్టే. ఉన్నా.. ఒకటీ అరా మాత్రమే.
దీంతో బీజేపీ నాయకులకు కీలక రాష్ట్రం తెలంగాణ. ఇక్కడ 17 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. వీటిని ఒడుపుగా దక్కించుకుంటే.. కనీసంలో కనీసం 10 చోట్లైనా పాగా వేస్తే..వారికి తిరుగు ఉండదనే లెక్క లు వేసుకుంటున్నారు. అయితే.. ఇది అంత ఈజీకాదు. దీనికి భారీ ఓటు బ్యాంకు అవసరం. ప్రస్తుతం బీజేపీకి తెలంగాణలో ఉన్న ఓటు బ్యాంకు 10-12 శాతం లోపే. ఒకటి రెండు నియోజకవర్గాల్లో మాత్రం కొంత ఎక్కువగా ఉంది.
ఈ క్రమంలోనే బీఆర్ ఎస్ నుంచి వలసలు ప్రోత్సహించి.. ఆ పార్టీ ఓటు బ్యాంకును దక్కించుకునే ప్రయ త్నాలు చేస్తున్నారు. 2023(గత ఏడాది) జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ ఎస్‌కు 37 శాతం ఓటు బ్యాంకు దక్కింది. ప్రస్తుత ఎన్నికల్లో .. రేవంత్ రెడ్డి పాలన చూసిన తర్వాత.. బీఆర్ ఎస్‌కు ఇది తగ్గుముఖం పడు తుందనే అంటున్నారు. మొత్తంగా బీఆర్ ఎస్‌కు 22 శాతం ఓటు బ్యాంకు మించదని చెబుతున్నారు. మిగి లిన ఓటు బ్యాంకు.. ఎటు పోతుంది? అంటే.. బీజేపీ వైపు అని అందరూ భావిస్తున్నారు.
ఇదే ఇప్పుడు బీఆర్ ఎస్ రాజకీయాలను వేడెక్కించింది. ఎందుకంటే.. తమ ఓటు బ్యాంకు చీలిపోయినా.. ఇష్టమే(కొన్ని కొన్ని సార్లు తప్పదు కాబట్టి). కానీ, అది బీజేపీకి మాత్రం మళ్లడానికి వీల్లేదు. ఎందుకంటే.. బీజేపీ కనుక పుంజుకుంటే.. ప్రాంతీయ పార్టీల పుట్టి మునిగిపోతోంది. ఈ విషయంలో ఇప్పటికే మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు ప్రత్యక్ష ఉదాహరణలు. ఇప్పుడు ఈ పరిస్తితి బీఆర్ ఎస్‌కు వచ్చినా..(సమీప కాలంలో) ఆశ్చర్యంలేదు. అందుకే.. బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ .. తన ఓటు బ్యాంకు చీలినా.. అది బీజేపీకి మళ్లకుండా జాగ్రత్తలు పడుతున్నారు.
తమను వ్యతిరేకించే వర్గాల ఓటు బ్యాంకు.. కాంగ్రెస్‌కు మళ్లినా.. ఆ పార్టీ ప్రాంతీయ పార్టీలతో పొత్తుకు ప్రయత్నిస్తోందే తప్ప.. మొత్తంగా తుడిచి పెట్టేయాలని చూడదు. ఇదే ఇప్పుడు కేసీఆర్ ఆలోచన. తన పార్టీ ఓటు బ్యాంకును కాంగ్రెస్ చీల్చినా ఇష్టమనేది ఆయన భావన. తద్వారా పార్టీ అయితే. బతికి ఉంటుందని అనుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.