సీఏఏ అమలును వ్యతిరేకించిన కేరళ సీఎం

కేంద్రం తీసుకొచ్చిన సీఏఏ (సిటిజన్ షిప్ అమండ్ మెంట్ ఆక్ట్ ) చట్టంకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది

Update: 2024-03-11 15:06 GMT

కేంద్రం తీసుకొచ్చిన సీఏఏ (సిటిజన్ షిప్ అమండ్ మెంట్ ఆక్ట్ ) చట్టంకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. కేరళ సీఎం పినరయ్ విజయన్ దీని అమలు చేయడానికి నో చెప్పారు. తమ రాష్ట్రంలో ఈ చట్టం అమలు చేయడానికి ససేమిరా అంటున్నారు. దీంతో బీజేపీ తీసుకొచ్చిన సీఏఏ చట్టం అమలు అంత సురక్షితం కాదని తెలుస్తోంది. దీనిపై సర్వత్రా విమర్శలు వచ్చే అవకాశాలు ఉన్నాయని పలువురు భావిస్తున్నారు. ఈనేపథ్యంలో దీని అమలుకు బీజేపీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో తెలియడం లేదు.

సెక్యులర్ దేశంలో మతపరమైన ఉద్దేశాలు ఆపాదించడం సరైంది కాదని విజయన్ స్పష్టం చేస్తున్నారు. ఏకపక్ష నిర్ణయాలు అమలు పరచాల్సిన అవసరం లేదని తెగేసి చెప్పడం వివాదాలకు తావిస్తోంది. దీంతో కేంద్రం కేరళపై ఎలాంటి ఆంక్షలు విధిస్తుందోనని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సీఏఏ చట్టం అమలు పరచాల్సిన అవసరం ఏముందనే వాదనలు వస్తున్నాయి.

బంగ్లాదేశ్, పాకిస్థాన్, అప్గనిస్తాన్ వంటి దేశాల నుంచి వచ్చిన హిందువులు, ముస్లింలు, సిక్కులు, బౌద్దులు, జైనులు తదితర మతాల వారు వచ్చినందుకు వారికి భారతీయ పౌరసత్వం ఇచ్చేందుకు కేంద్రం చట్టం తీసుకొచ్చింది. ఇందులో ముస్లింలకు ఆ అవకాశం లేకుండా చేసింది. దీన్ని చట్టంగా ఆమోదం తెలిపింది. సార్వత్రిక ఎన్నికల మందు తీసుకొచ్చిన చట్టం కావడంతో దీని అమలు అంత సులభం కాదని పలువురు పేర్కొంటున్నారు.

దీనిపై కేంద్రం కూడా మొండి వైఖరితోనే ఉన్నట్లు సమాచారం. రాష్ట్రాలు కచ్చితంగా దీన్ని అమలు చేయాలని ఆదేశాలు జారీ చేస్తోంది. ఈ చట్టాన్ని వ్యతిరేకించే విజయన్ పై ఏ రకమైన చర్యలు తీసుకుంటుందో అని చూస్తున్నారు. వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడంలో బీజేపీ సాహసం గురించి చెప్పాల్సిన పనిలేదు. కానీ ప్రస్తుతం సీఏఏ చట్టం అమలు అంత సులభంగా మారుతుందా అనేది తేలాల్సి ఉంది.

కేంద్రం తీసుకొచ్చిన ఈ చట్టాన్ని అయోధ్య రామమందిర ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్ ప్రశంసించారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం సరైందేనని అభివర్ణించారు. సీఏఏ అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్రాలపై ఉందని చెప్పారు. ఈ క్రమంలో సీఏఏ చట్టం అమలు చేయడానికి కేంద్రం ఎలాంటి మార్గదర్శకాలు విడుదల చేస్తుందో చూడాలి మరి. ఇలాంటి నిర్ణయాన్ని ఇంకా ఎన్ని రాష్ట్రాలు విభేదిస్తాయో తెలియడం లేదు.

Tags:    

Similar News