కేరళలో విరిగి పడిన కొండ చరియ.. చిక్కుకున్న వందలాది మంది?

ఈ విపత్తు గురించిన సమాచారం అందుకున్నంతనే కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం, అగ్నిమాపక టీం.. జాతీయ విపత్తు స్పందన దళాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి.

Update: 2024-07-30 04:30 GMT

ఈ రోజు (మంగళవారం) తెల్లవారుజామున కేరళలో ఘోరం చోటు చేసుకుంది. వాయనాడ్ జిల్లా మెప్పాడి సమీపంలోని కొండ ప్రాంతంలో భారీగా కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో వందలాది మంది చిక్కుకుపోయినట్లుగా భావిస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ఉదంతంలో దాదాపు ఏడుగురు మరణించారని తెలుస్తోంది.

ఈ విపత్తు గురించిన సమాచారం అందుకున్నంతనే కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం, అగ్నిమాపక టీం.. జాతీయ విపత్తు స్పందన దళాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఈ ఘటనకు దగ్గర్లోని ప్రాంతాలనుంచి కూడా సహాయ టీంలు వెళ్లాయి. కొండ చరియల కింద చాలామంది చిక్కుకొని ఉండి ఉంటారని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. భారీ వర్షాలు కురుస్తున్న వేళ సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది.

భారీ వర్షాలు కారణంగా కొన్నిసార్లు కొండ చరియలు విరిగి పడుతుంటాయి. తాజా ఉదంతానికి ఇదే కారణమని భావిస్తున్నారు. కొండ చరియల కింద చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకకు వీలుగా కేరళ స్టేట్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీకి చెందిన ఫైర్ ఫోర్స్ ను కూడా పంపారు.

పెద్ద ఎత్తున మొదలైన రెస్క్యు ఆపరేషన్ కు వాతావరణం సహకరిస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు. అందరూ క్షేమంగా బయటపడాలని మనమంతా కోరుకుందాం.

Tags:    

Similar News