ఈ ఎంపీ తీరు ఎవ‌రికీ అర్ధం కాదే.. పార్టీకి మేలా? కీడా?

కానీ, అదేం చిత్ర‌మో కానీ.. టీడీపీ ఎంపీ కేశినేని నాని వ్య‌వ‌హార శైలి మాత్రం.. త‌ను ఒంటికి వాత‌లు అంటించుకుంటూ

Update: 2023-08-07 05:59 GMT

ఏ నాయ‌కుడైనా.. ప్ర‌జాప్ర‌తినిధి అయినా.. తాను చేసే చ‌ర్య‌ల ద్వారా.. తాను మాట్లాడే మాట ద్వారా పార్టీకి కానీ.. ప్ర‌జ‌ల‌కు కానీ.. లేదా వ్య‌క్తిగ‌తంగా త‌న‌కు కానీ మేలు చేసుకునేలా వ్య‌వ‌హ‌రించ‌డం కామ‌న్‌.

కానీ, అదేం చిత్ర‌మో కానీ.. టీడీపీ ఎంపీ కేశినేని నాని వ్య‌వ‌హార శైలి మాత్రం.. త‌ను ఒంటికి వాత‌లు అంటించుకుంటూ.. సొంత నేత‌ల‌కు కూడా అంటించుకునే టైపు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని అంటున్నారు పార్టీ నేత‌లు.

గ‌త మూడేళ్ల నుంచి పార్టీ అధినేత ముద్దు.. ఇత‌ర నేత‌లు వ‌ద్దు అన్న‌ట్టుగా నాని రాజ‌కీయం సాగుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాను అనేది త‌ర్వాత చెబ‌తానంటూ.. కొన్ని రోజుల కింద‌ట వ్యాఖ్య‌లు చేసి.. త‌న‌కు తానే వివాదం సృష్టించుకున్న నాని.. తాజాగా సొంత నాయ‌కుల‌పై మ‌రోసారి ప‌రోక్ష వ్యాఖ్య‌లుచేసి.. వేడి పుట్టించారు. ఎక్క‌డైనా ఎంపీ స్థాయిలో ఉన్న నాయ‌కుడు.. అంద‌రినీ క‌లుపుకొని పెద్ద‌న్న మాదిరిగా ముందుకు సాగాలి.

కానీ, అదేంటో కేశినేని నాని మాత్రం ఇటు పార్టీ నాయ‌కుల‌కు అటు ప్ర‌జ‌ల‌కు కూడా అర్థం కావ‌డం లేద‌ని అంటున్నారు. ''నేను చేసే రాజకీయం అర్థం కాకూడదు. అర్ధం అయితే రాజకీయాలకు పనికిరాన‌ట్టే. ఎవ‌రి రాజ‌కీయం వారిది.

రాజకీయం అర్థం అయితే పైకి రాలేం'' అని ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యానించా రు. అంతేకాదు.. ''రాజకీయంలో లెఫ్ట్, రైట్, సెంటర్ కొట్టుకుంటూ అర్దం కాకుండా వెళ్లాలి. అదే రాజకీ యం'' అని కొత్త సూత్రం చెప్పారు.

ఇక‌, నందిగామ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయ‌కురాలు తంగిరాల సౌమ్యపైనా నిర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేశారు. ఆమెకు తనకు ఎటువంటి విభేదాలు లేవంటూనే.. త‌నేమీ వ్యాపారాలు చేయ‌డం లేదంటూ.. వ్యాఖ్యానిం చారు. ''సౌమ్యకు, నాకు ఏమైనా ఆస్తి తగాదాలు, ఇసుక వ్యాపారాలు, మట్టి వ్యాపారాలు ఉన్నాయా?'' అని వ్యాఖ్యానించారు. మొత్తంగా ఈ వ్యాఖ్య‌లు ఎవ‌రికీ అంతు చిక్క‌క పోవడంతో ఆయ‌న ఎవ‌రికీ అర్థం కారా? అనే స‌దేహాలు.. ప్ర‌శ్న‌లు మ‌రోసారి తెర‌మీద‌కు వ‌చ్చింది.

Tags:    

Similar News