జనసేన నుంచి వైసీపీలోకి...?
అందులో నెల్లూరు జిల్లా సిటీకి చెందిన నేత కేతం రెడ్డి వినోద్ రెడ్డి. ఆయన ఇటీవల వైసీపీలో చేరారు. ఆయన తాజాగా జనసేన మీద నిప్పులే చిరిగారు.
ఏపీలో జనసేన వచ్చే ఎన్నికల్లో కీలకంగా మారాలని చూస్తోంది. టీడీపీతో పొత్తు పెట్టుకుని ముందుకు సాగుతోంది. అయితే జనసేన పొత్తు వ్యవహారం పార్టీలో చాలా మందికి నచ్చడంలేదు. గత నాలుగైదేళ్లుగా తాము ఒక సీటు మీద గురి పెట్టి కాలాన్ని ధానాన్ని శ్రమను పెట్టుబడిగా పెట్టిన తరువాత చివరి నిముషంలో అది పొత్తులోకి పోతే ఇక ఎలా తమ ఫ్యూచర్ అన్న ఆందోళన అయితే ఉంటుంది.
ఇక జనసేనకు టీడీపీ ఎన్ని సీట్లు ఇస్తుందో అన్నది తెలియదు. మరో వైపు చూస్తే జనసేనల ఒ చాలా మంది ఆశావాహులు అయితే ఈ పొత్తుల మీద మధనపడుతున్నారు. కొందరు తమ దారి తాము చూసుకుంటే మరికొందరు వేచి చూసే ధోరణిలో ఉన్నారు. ఇంకొందరు అధినేత ఇచ్చే హామీని బట్టి తమ సమ్మతిని తెలియచేయాలని చూస్తున్నారు.
ఏది ఏమైనా వారాహి యాత్ర మూడు విడతలతో ఎంతో ఊపు మీద ఉన్న జనసేన నాలుగవ విడత మాత్రం సో సోగా సాగింది. ఆ తరువాత చూస్తే జనసేనలో అసంతృప్తి కూడా బయటకు మెల్లగా వస్తోంది. చాలా మంది కీలక నాయకులు జనసేనకు రాజీనామా చేస్తున్నారు. మరికొందరు రాజీనామా చేయబోతున్నారు అని టాక్ నడుస్తోంది.
అందులో నెల్లూరు జిల్లా సిటీకి చెందిన నేత కేతం రెడ్డి వినోద్ రెడ్డి. ఆయన ఇటీవల వైసీపీలో చేరారు. ఆయన తాజాగా జనసేన మీద నిప్పులే చిరిగారు. జనసేన పార్టీకి పవన్ కి బ్లాక్ హోల్ ఎవరు అంటే నాదెండ్ల మనోహర్ అని ఆయన అంటున్నారు. నాదెండ్ల వల్లనే జనసేన పతనం అవుతోందని ఆయన మండిపడ్డారు.
ఉత్తిత్తి కమిటీలను జిల్లాలో ఏర్పాటు చేసి జనసేనను ఏమీ కాకుండా చేస్తున్న నాదెండ్ల మొత్తం అంతా దారుణమైన పరిస్థితి తయారు కావడానికి కారకుడు అని కేతం రెడ్డి ఫైర్ అయ్యారు. జనసేనలో కాపు నాయకులు అంతా ఒక్కొక్కరుగా బయటకు వెళ్ళిపోవడానికి నాదెండ్ల కారణం అని ఆరోపించారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణతో పాటు చాలా మంది మేధావులు పార్టీని విడిచిపెట్టారని గుర్తు చేశారు.
ఇదిలా ఉంటే నాదెండ్ల జనసేనను రేప్ చేస్తున్నారు అని కేతం రెడ్డి అల్టిమేట్ కామెంట్ చేశారు. నాదెండ్ల తన స్వార్ధం తాను చూసుకునే రకం అని అన్నారు. ఆయన పొత్తులలో భాగంగా తన తెనాలి సీటు టీడీపీకి అప్పగిస్తారా చెప్పాలని సవాల్ చేశారు. అంటే తన సీటు తనకు ఉండాలి పార్టీ నేతలు ఏమైపోయినా ఫరవాలేదు అన్నది నాదెండ్ల వైఖరి అన్నారు. పవన్ కళ్యాణ్ షూటింగులు చేసుకుంటూ పార్టీని నాదెండ్లకు అప్పగిస్తే ఆయ్న అన్ని విధాలుగా సర్వనాశనం చేశారని కేతమ్రెడ్డి ఫైర్ అయ్యారు.
జనసేనలో చాలా మంది నాయకులు మండిపోతున్నారని, జనసేనను తెచ్చి టీడీపీ పల్లకీ మోయించడం పట్ల వారంతా ఆగ్రహంగా ఉన్నారని కేతం రెడ్డి అన్నారు. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు విశాఖ జిల్లా నుంచి పెద్ద నాయకులు అంతా జనసేనను వీడి తొందరలో వైసీపీలో చేరుతారు అని కేతం రెడ్డి జోస్యం చెప్పారు. మరోసారి ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన అన్నారు. ఏపీలో జనసేన సొంతంగా పోటీ చేయకుండా పొత్తులకు వెళ్లడం ఆ పార్టీకి తీవ్ర నష్టం అని ఆయన అంటున్నారు. మరి జనసేన నుంచి టీడీపీలోకి వచ్చే నాయకులు ఎవరో చూడాల్సి ఉంది.