కాంగ్రెస్ కు రాయబారాలు పంపుతున్న కీలక అధికారులు?
అందునా అధికార బదిలీకి అవకాశాలు ఉన్నాయన్నంతనే.. కీలక స్థానాల కోసం కర్ఛీఫ్ వేసుకోవటం తెలివైన పని అన్నది మర్చిపోకూడదు.
నిజం ఎంతన్న విషయాన్ని పక్కనపెడితే.. తాజాగా తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల వేళ.. కీలక పరిణామం చోటు చేసుకుందన్నమాట బలంగా వినిపిస్తోంది. మరో రోజులోకి పోలింగ్ వెళ్లిన వేళ.. ఇప్పుడీ లొల్లి ఏమిటి? అన్న సందేహం కొందరికి కలగొచ్చు. కానీ.. అందరి లెక్కలు ఒకేలా ఉండవు కదా. అందునా అధికార బదిలీకి అవకాశాలు ఉన్నాయన్నంతనే.. కీలక స్థానాల కోసం కర్ఛీఫ్ వేసుకోవటం తెలివైన పని అన్నది మర్చిపోకూడదు.
ఇప్పుడు తెలంగాణలో అలాంటి తీరే నడుస్తుందన్న మాట బలంగా వినిపిస్తోంది. ఇందుకు తగ్గట్లే.. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఐఏఎస్.. ఐపీఎస్ లు పలువురు లాబీయింగ్ మొదలు పెట్టినట్లుగా చెబుతున్నారు. అందుకే.. ఆలస్యం చేయకుండా ముందే ఎవరికి వారు ప్రయత్నాల్ని మొదలుపెట్టినట్లుగా చెబుతున్నారు. అధికార బదిలీ జరగటం కలేనని.. అంత ఈజీ కాదని కొందరు అధికారులు వాదిస్తున్నారు.
అయితే.. కాంగ్రెస్ అధినాయకత్వం టచ్ లోకి వెళ్లిన ఐఏఎస్.. ఐపీఎస్ లు.. తమకు ఏదైనా టాస్కును ఇస్తే తమ సత్తా ఏమిటో చాటుతామన్న మాటను చెప్పినట్లుగా తెలుస్తోంది. గులాబీ సర్కారులో తమకు ప్రాధాన్యత దక్కలేదని.. తమకు సమర్థత ఉన్నా కలిసి రాని కాలానికి చిక్కుకున్నట్లుగా చెబుతూ.. వారి మనసుల్లో తాము రిజిస్టర్ అయ్యేలా చేస్తున్నట్లుగా చెబుతున్నారు. పోలింగ్ కూడా కాక ముందే.. పరిపాలనలో కీలకమైన ఐఏఎస్.. ఐపీఎస్ లు ఇప్పటికే రాయబారాల్ని షురూ చేసిన ట్రెండ్ కాంగ్రెస్ కు కొత్త శక్తిని ఇస్తుందన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.