ప్రధాని పదవి తీసుకోం.. ఖర్గే బిగ్ స్టేట్ మెంట్..

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంచలన ప్రకటన చేశారు.

Update: 2023-07-18 08:50 GMT

కర్ణాటక రాజధాని బెంగళూరు లో ప్రతిపక్షాల సమావేశం జోరు గా సాగుతోంది. అన్ని కీలక ప్రతిపక్షాల నేతలూ హాజరవడంతో వారంతా గట్టి పట్టుదలతో ఉన్నట్లు తెలిసిపోతోంది. తొలి రోజు సోమవారం హాజరుకాని శరద్ పవార్ మంగళవారం ప్రత్యేక విమానం లో బెంగళూరు చేరుకున్నారు. దీంతో ప్రతిపక్షాల ఐక్యత పై ఉన్న చిన్న సందేహం కూడా వీడిపోయింది. వాస్తవానికి గత సమావేశానికి శరద్ పవార్ కీలక సమన్వయకర్త. అయితే, ఆ తర్వాత ఆయన పార్టీ ఎన్సీపీని అన్న కుమారుడు అజిత్ పవార్ చీల్చడంతో పరిస్థితి తలకిందులైంది. ఆఖరికి ఆది, సోమవారాల్లో అజిత్ పవార్ వర్గం శరద్ ను కలవడం.. బెంగళూరు భేటీకి వెళ్లొద్దనడంతో ఏదో జరుగుతోంది అన్న సందేహం కలిగింది. కానీ, అదేమీ లేదని శరద్ పవార్ స్పష్టం చేసినట్లయింది.

11 రాష్ట్రాల్లో అధికారం..

ప్రతిపక్ష పార్టీల భేటీనుద్దేశించి ఒక్కో పార్టీ అధ్యక్షుడు ప్రసంగిస్తున్నట్లు తెలుస్తోంది. లేదా వారివారి అభిప్రాయాల ను వ్యక్తీకరిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంచలన ప్రకటన చేశారు. తాము (ప్రతిపక్షాలు) 11 రాష్ట్రాల్లో అధికారం లో ఉన్నామని చెప్పుకొచ్చారు. మొత్తం 26 పార్టీలు పాల్గొన్న విషయాన్ని ప్రస్తావించారు. రాష్ట్రాల స్థాయి లో తమ మధ్య విభేదాలు ఉన్న సంగతిని అంగీకరించారు. అయితే, అవి సైద్ధాంతికమైనవి కాదని చెప్పుకొచ్చారు.

బీజేపీ ని గెలవనివ్వం

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఉమ్మడిగా ఉంటామని.. బీజేపీ ని గెలవనివ్వమని ప్రతిపక్ష నేతల సమావేశం లో ఖర్గే వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో బీజేపీ 303 సీట్లు సొంతంగా గెలవల ని సంగతిని గుర్తుచేశారు. నాడు మిత్రపక్షాలతో కలిసి పోటీచేసిందని.. వాటి బలాన్ని ఉపయోగించుకుని తర్వాత విస్మరించిందని ఆరోపించారు.

ప్రధాని పదవి తీసుకోరట

వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఉమ్మడిగా పోటీ చేసినా.. వాటిలో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగానే ఉంటుంది. అందులోనూ ఆప్ తప్ప మిగతావన్నీ ప్రాంతీయ పార్టీలే. అలాంటప్పుడు కాంగ్రెస్ పెద్దన్నగానే వ్యవహరిస్తుంది. కానీ, ఖర్గే మాత్రం సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో తమ కూటమి అధికారం లో వస్తే కాంగ్రెస్ పార్టీ ప్రధాని పదవి కోరదని.. ఆ ఆసక్తి లేదని చెప్పుకొచ్చారు. సొంత రాష్ట్రం కర్ణాటక లో జరుగుతున్న సమావేశం లోనే ఆయన నోటి నుంచి ఈ ప్రకటన రావడం గమనార్హం.

మరి ప్రధాని అభ్యర్థి ఎవరో..?

కాంగ్రెస్ ఇతర ప్రతిపక్షాల సమావేశాన్ని ఉద్దేశించి ఇప్పటికే బీజేపీ విమర్శలు ఎక్కుపెడుతోంది. అసలు ప్రధాని అభ్యర్థి ఎవరో చెప్పాల ని డిమాండ్ చేస్తోంది. ఇప్పుడు ఖర్గే ప్రకటన నేపథ్యంలో అసలు వారి కూటమి అభ్యర్థి ఎవరనేది తేలాల్సి ఉంది. ప్రతిపక్షాల నుంచి ప్రధానమంత్రి రేసు లో ఇఫ్పటికే చాలామంది నేతలు ఉన్నారు. శరద్ పవార్, నీతీశ్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్, మమతా బెనర్జీ, అర్వింద్ కేజ్రీవాల్ ఇలా ఎందరో ప్రధాని రేసు లో ఉన్నారు. కాంగ్రెస్ రేసులో ఉండదని ఖర్గే ప్రకటనతో తెలుస్తోంది. మరి.. ఆఖరికి అభ్యర్థి ఎవరో?

Tags:    

Similar News