సొంత నానమ్మ ఇంటినే కూల్చేసిన కిమ్... కారణం తెలుసా..?

అయితే... అతడి తాత రెండో భార్య కిమ్ సంగ్ ఏ సంతానానికీ వారసత్వం అప్పగించేందుకు ప్రయత్నాలు జరిగిందనే విషయం తెరపైకి వచ్చిందంట.

Update: 2024-08-08 14:12 GMT

ఉత్తరకొరియా అధినేత, నియంత కిమ్ జోంగ్ ఉన్ గురించి తెరపైకి వచ్చే వార్తలు ఎంత సంచలనంగా ఉంటాయనేది తెలిసిన విషయమే. ఈ జనరేషన్ కు కూడా నియంత అంటే ఎట్లా ఉంటాడో స్పష్టంగా చూపించడానికి విశ్వప్రయత్నాలు చేస్తుంటాడు. ఈ క్రమంలో ఉన్నపలంగా తన నాన్నమ్మ ఇంటికి బుల్దోజర్లు పంపించి కూల్చేశాడు.

అవును... తన అధికారానికి, తన నియంతృత్వ పోకడలకూ అడ్డువస్తున్నారని తెలిస్తే ఉత్తర కొరియా నియంత కిమ్ ఎలా మారిపోతాడో చెప్పడానికి చాలా ఉదాహరణలే ఉన్నాయి. తనకు అడ్డురానవసరం లేదు.. అడ్డురావాలని ఆలోచిస్తున్నారని తెలిసినా, ఇతడికి సందేహం వచ్చినా వాళ్లను వదిలిపెట్టడని అంటుంటారు. ఈ సమయంలోనే తన నాన్నమ్మ ఇంటిని నేలమట్టం చేశాడు.

వివరాళ్లోకి వెళ్తే... కిమ్ జోంగ్ ఉన్ తాత పేరు కిమ్ ఇల్ సంగ్ మొదటి భార్య మరణించడంతో రెండో వివాహం చేసుకున్నాడు. ఆ మరణించిన మొదటి భార్య కుమారుడి వారసుడే ఈ కిమ్ జోంగ్ ఉన్. అయితే... అతడి తాత రెండో భార్య కిమ్ సంగ్ ఏ సంతానానికీ వారసత్వం అప్పగించేందుకు ప్రయత్నాలు జరిగిందనే విషయం తెరపైకి వచ్చిందంట.

అయితే... అప్పటికే కిమ్ తాత కిమ్ ఇల్ సంగ్ మరణించడంతో.. కిమ్ జోంగ్ ఉన్ తండ్రి కిమ్ జోంగ్ ఇల్.. ఆమెను 1994లో "హోప్ జాంగ్ ప్యాలెస్" అనే భవనంలో నిర్భందించాడు. ఆ ప్యాలెస్ ఓ పర్వత ప్రాంతంలో ఉంటుంది. ఇక్కడ సుమారు 11 హెక్టార్ల అటవీ ప్రాంతం తో పాటు హోప్ జాంగ్ నది ఉన్నాయి. ఇక్కడ ఆమెకు కావాల్సిన సౌకర్యాలు విత్ సెక్యూరిటీ ఏర్పాటు చేశాడు!

ఈ క్రమంలో... 2014లో కిమ్ సంగ్ ఏ మరణించింది! అయితే తాజాగా ఆ ప్యాలెస్ ను ప్రస్తుత నియంత కిమ్ జోంగ్ ఉన్ బుల్డోజర్ల సాయంతో నేలమట్టం చేయించాడు. అసలు ఆ భవనం ఆనవాళ్లు కూడా కనిపించకుండా ఆ ప్రదేశాన్ని చదును చేయించినట్లు చెబుతున్నారు. అయితే... ఇప్పుడు ఉన్నపలంగా కిమ్ కి ఆ ప్యాలెస్ ను కూల్చాసిన అవసరం, ఆలోచనా ఎందుకు వచ్చిందనేది మాత్రం సస్పెన్స్ గానే ఉంది!

Tags:    

Similar News