కారు గాలి తీసేస్తూ..పొత్తు పై తేల్చేసిన కిషన్ రెడ్డి
బీజేపీ దమ్ము గురించి మాట్లాడిన ఆయన తెలంగాణలోని 17 లోక్ సభ నియోజకవర్గాల్లోనూ పోటీ చేస్తుందన్న కిషన్ రెడ్డి.. బీఆర్ఎస్ తో బీజేపీ పొత్తు అంటూ ఎవరైనా మాట్లాడితే రెండు చెంపలపై కొట్టాలి.
బీఆర్ఎస్.. బీజేపీలు కలిసిపోతున్నాయని.. ఆ దిశగా పరిణామాలు చోటు చేసుకుంటున్నట్లుగా జరుగుతున్న ప్రచారంపై తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. రోటీన్ కు భిన్నంగా ఆయన నోటి నుంచి స్పష్టమైన క్లారిటీ వచ్చేసింది. గులాబీ పార్టీతో పొత్తు ఎందుకు ఉంటుందన్న మౌలిక ప్రశ్నను సంధించిన కిషన్ రెడ్డి గులాబీ కారు గాలి తీసేసిన విధంగా ఆయన తాజా వ్యాఖ్యలు ఉండటం గమనార్హం.
'బీఆర్ఎస్ తో బీజేపీ పొత్తు ప్రచారం చేసేవాళ్లు మూర్ఖులే. మూర్ఖులు.. దుర్మార్గులు చేసే ప్రచారాన్ని ఖాతరు చేయం. మెడపై తలకాయ ఉన్న వారెవరూ ఇలాంటి ప్రచారం చేయరు. బీఆర్ఎస్ మునిగిపోయే నావ.
అలాంటి నావకు సహకరించే ప్రసక్తే లేదు. మాకు ఒక్క ఎమ్మెల్యే సీటు వచ్చినప్పుడు బీఆర్ఎస్ తో కలవలేదు. ఇప్పుడెందుకు కలుస్తాం? కలవటానికి బీఆర్ఎస్ దగ్గర ఏముంది? తెలంగాణకు ఆ పార్టీ అవసరం ఉందా?'' అంటూ గులాబీ కారు గాలిని అడ్డంగా తీసేశారు కిషన్ రెడ్డి.
బీజేపీ దమ్ము గురించి మాట్లాడిన ఆయన తెలంగాణలోని 17 లోక్ సభ నియోజకవర్గాల్లోనూ పోటీ చేస్తుందన్న కిషన్ రెడ్డి.. బీఆర్ఎస్ తో బీజేపీ పొత్తు అంటూ ఎవరైనా మాట్లాడితే రెండు చెంపలపై కొట్టాలి. లోకేశ్ సభ ఎన్నికల్లో హైదరాబాద్ ఎంపీ సీటును కూడా గెలుచుకుంటాం'' అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ తరహాలో ఓపెన్ గా బీఆర్ఎస్ పొత్తు అన్నోళ్ల రెండు చెంపలు పగలకొట్టాలంటూ పిలుపునిచ్చిన కిషన్ రెడ్డి మాటలు సంచలనంగా మారాయి. ఇటీవల కాలంలో ఇంత క్లారిటీగా పొత్తు అంశాన్ని తేల్చేయలేదంటున్నారు. ఏమైనా కిషన్ రెడ్డి మాటల్లోని క్లారిటీ రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపుతుందని మాత్రం చెప్పక తప్పదు.