చీరలో చేప పిల్ల... యువతి కైట్ బోర్డింగ్ వీడియో వైరల్!
అవును.... తాజాగా ఓ మహిళ చీరకట్టుకుని ఎగసిపడుతున్న సముద్రంపు అలలపై అలవోకగా తేలియాడుతూ కైట్ బోర్డింగ్ చేస్తోంది.
భారతీయ మహిళలు ఏది చేసినా వెరైటీగా ఉంటుందని అంటుంటారు. ముఖ్యంగా ప్రపంచంలో భారతీయ మహిళలకు స్పెషల్ గుర్తింపుని తీసుకుని వచ్చింది ఆ చీరకట్టు అని అంటారు. రోజువారీ దినచర్యల్లో భాగంగా కాస్త సౌలభ్యం కోసం డ్రెస్స్, జీన్స్ వంటివాటిని ధరించినా.. పండగలు, శుభ కార్యాలు వస్తే మాత్రం చీరలు కట్టుకుని సందడి చేస్తుంటారు. చీరకట్టులో ఉన్న సొగసు చూడరమా అనిపిస్తారు.
ఈ నేపథ్యంలో చీరకట్టి కైట్ బోర్డింగ్ చేసింది ఒక మహిళ. సరిగా ఆలోచించి ప్లాన్ చేసుకోవాలే కానీ... చీరకంటే సౌకర్యవంతమైన దుస్తులు లేవని చెప్పాలనుకున్నారో.. లేక, ఆ పనిచేసేది భారతీయ మహిళ అనే విషయం చూడగానే గుర్తుకు రావాలని భావించారో తెలియదు కానీ... చీరకట్టి సముద్రంలో కైట్ బోర్డింగ్ చేశారు.
అవును.... తాజాగా ఓ మహిళ చీరకట్టుకుని ఎగసిపడుతున్న సముద్రంపు అలలపై అలవోకగా తేలియాడుతూ కైట్ బోర్డింగ్ చేస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇదే సమయంలో ఈ వీడియో కింద నెటిజన్లు ఫుల్ జోష్ లో కామెంట్లు పెడుతున్నారు. ఆమెను తమదైన వర్ణనతో అభినందిస్తున్నారు.
పసుపు రంగు చీర, ఆరెంజ్ రంగు బ్లౌజ్ ధరించిన ఒక మహిళ... నడుంకు బెల్డు కట్టుకుని, సముద్రంపై చేప పిల్లలా సందడి చేస్తూ, కైట్ బోర్డింగ్ చేస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో జూలై 10వ తేదీన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో ఇప్పటివరకూ సుమారు ఇరవై లక్షల మంది లైక్ చేశారు.
ఇక వైరల్ అవుతున్న ఈ వీడియోలో మహిళ కైట్, డైవ్ శిక్షకురాలని తెలుస్తుంది. భారత్ లో కైట్ బోర్డింగ్ కు ప్రాచుర్యం తీసుకురావమే లక్ష్యం అంటూ ఈ వీడియో చేసినట్లు చెబుతున్నారు.