కొడాలి నానిది సంతృప్తా.. వైరాగ్యమా..?
ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే
ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో మహా మహా నాయకులు అనుకున్నవారు సైతం ఓటమి పాలైన పరిస్థితి. ఇక పెద్దిరెడ్డి మినహా మంత్రులుగా పనిచేసినవారంతా ఓటమి పాలైన పరిస్థితి. ఈ సమయంలో వైసీపీ కీలక నేతల గురించి ఆసక్తికరమైన చర్చలు తెరపైకి వస్తున్నాయి.
అవును... ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ సమయంలో.. ఆ పార్టీ నేతల గురించిన ఆసక్తికరమైన చర్చలు హల్ చల్ చేస్తున్నాయి. ఇందులో భాగంగా పలువురు వైసీపీ నేతలు పక్క చూపులు చూస్తున్నారని.. బీజేపీలో చేరబోతున్నారని రకరకాల ప్రచారాలు వైరల్ అవుతున్నాయి.
ఈ సమయంలో కొడాలి నాని గురించి గుడివాడలో ఓ టాక్ పీక్స్ కి చేరింది! ఇందులో భాగంగా... మాజీమంత్రి కొడాలి నాని రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకోబోతునారని.. ఇక క్రియాశీల రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతున్నారని.. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసే ఆలోచన చేయడం లేదనే టాక్ గుడివాడ రాజకీయాల్లో చక్కర్లు కొడుతుంది.
అయితే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు అంటూ ప్రచారం జరుగుతున్నవి మాత్రం విభిన్నంగా ఉన్నాయి! ఇందులో భాగంగా... ఆయన ఆరోగ్య కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారని కొందరు చెబుతుండగా.. ఇటీవల ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలవ్వడంతో వైరాగ్యం వంటివి వచ్చి ఉంటుందని మరికొంతమంది ప్రచారం చేస్తున్నారు!
అయితే కారణాలు ఏవైనా... కొడాలి నాని గురించి గుడివాడ రాజకీయాల్లో జరుగుతున్న ఈ ప్రచారంపై పూర్తి స్పష్టత ఆయనే ఇవ్వాల్సి ఉంది. మరోపక్క... వచ్చే ఎన్నికల్లో ఆయన కుటుంబం నుంచే నెక్స్ట్ జనరేషన్ రాజకీయాల్లోకి రాబోతున్నారని.. ఈసారి గుడివాడ ఎమ్మెల్యే స్థానానికి వారే పోటీ చేస్తారనీ ప్రచారం జరుగుతుంది. నాని స్పష్టత ఇవ్వాల్సి ఉంది!
కాగా... గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కొడాలి నాని... ఇటీవల వైసీపీ ప్రభుత్వంలో రెండున్నరేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రిగానూ పనిచేశారు. వైసీపీలో కీలక నేతగా ఉన్నారు. ఇదే సమయంలో నానికి స్టేట్ వైడ్ సెపరేట్ ఫ్యాన్ బెల్ట్ ఉందని అంటారు.
ఈ సమయంలో కొడాలి నాని నిజంగానే ఈ తరహా నిర్ణయం తీసుకుంటే... అది రాజకీయంగా సంతృప్తితో కూడా అయ్యి ఉండొచ్చనే చర్చా నడుస్తుంది.