'జెండా' స‌భ‌పై కొడాలి నాని పంచ్‌లు

''పవన్ కళ్యాణ్, సీఎం జగన్ ను తొక్కడం కాదు. పవన్ కళ్యాణ్ ను నాశనం చేస్తున్న చంద్రబాబును 80 లక్షల పాదాలు తిరిగి లేవకుండా పాతాళానికి తొక్కుతాయి'' అని వ్యాఖ్యానించారు.

Update: 2024-02-29 14:30 GMT

మాజీ మంత్రి, వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు కొడాలి నాని.. తాజాగా బుధ‌వారం జ‌రిగిన టీడీపీ-జ‌న‌సేన మిత్ర‌ప‌క్ష తొలి జెండా స‌భ పై పంచ్‌లు పేల్చారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఒక‌రిని తొక్క‌డం కాద‌ని.. ప్ర‌జ‌లే ప‌వ‌న్‌ను, చంద్ర‌బాబును తొక్కేస్తార‌ని వ్యాఖ్యానించారు. ''పవన్ కళ్యాణ్, సీఎం జగన్ ను తొక్కడం కాదు. పవన్ కళ్యాణ్ ను నాశనం చేస్తున్న చంద్రబాబును 80 లక్షల పాదాలు తిరిగి లేవకుండా పాతాళానికి తొక్కుతాయి'' అని వ్యాఖ్యానించారు.

కుక్క కాటుకు చెప్పు దెబ్బలా, కాపు సామాజిక వర్గం చంద్రబాబుకి బుద్ధి చెబుతుందని నాని అన్నారు. ప్రజలకు ఏం చేస్తారో చెప్పకుండా చంద్రబాబు పవన్ కళ్యాణ్ జెండా సభలు పెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలను.. పార్టీని.. తనను నమ్ముకుని ఉన్న వారికి అన్యాయం చేయ‌డ‌మేన‌న్నారు. చంద్రబా బు, పవన్ కళ్యాణ్ ను నమ్ముకొని ఆయన ఓటు బ్యాంకుతో గెలవాలని ప్ర‌య‌త్నిస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నాడ‌ని ప‌వ‌న్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు.

సీఎం జగన్ ను పవన్ కళ్యాణ్ దారుణాతి దారుణంగా తిడుతున్నాడ‌ని, తాము కూడా తిట్ట‌డం ప్రారం భిస్తే.. ఓర్వ‌లేడ‌ని అన్నారు. అయితే.. ఇది.. వారు కోరుకుంటున్న‌దేన‌ని.. ఆ ఉచ్చులోకి తాము దిగ‌బోమ‌ని అన్నారు. పవన్ సామాజిక వర్గాన్ని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు చంద్రబాబు కుటిల రాజకీయాలు చేస్తున్నాడని విమ‌ర్శ‌లు గుప్పించారు.

చేసిన మంచిని చెబుతూ, ప్రజలను నమ్మిన సీఎం జగన్ 175 స్థానాల్లో అభ్యర్థులను నిలుపుతున్నారని కొడ‌లి తెలిపారు. 14 ఏళ్ల అధికారం వెలగబెట్టిన చంద్రబాబు, ఐదేళ్లు మద్దతు ఇచ్చిన పవన్ కళ్యాణ్ మా పాలను చూసి ఓటెయ్యండని అడగలేని దుస్థితిలో ఉన్నారనికొడాలి దుయ్య‌బ‌ట్టారు. చంద్రబాబు తమ సామాజిక వర్గానికి 21 సీట్లు ప్రకటించారని, మరో 10 స్థానాలు కూడా క‌మ్మ‌ల‌కే ఇస్తార‌ని తెలిపారు. 3 శాతం ఓటు బ్యాంకు ఉన్న క‌మ్మ‌ల‌కు 31 సీట్లు ఇస్తే, తమకు 20శాతం ఓటింగ్ ఉందని చెబుతున్న జనసేన పార్టీ శ్రేణులు, పవన్ కళ్యాణ్ అభిమానులకు ఎన్ని సీట్లు ఇవ్వాలని ప్ర‌శ్నించారు.

24 సీట్లతో తాము సంతృప్తిగా లేమని జనసైనికులు బహిరంగంగా చెబుతున్నారని, తనపై సింపతీ క్రియేట్ చేసుకొని తన సామాజిక వర్గ ఓట్ల ద్వారా చంద్రబాబును సీఎం చేయడానికే.. పవన్ కళ్యాణ్ యుద్ధం మొదలుపెట్టినట్లు ఫీల్ అవుతున్నారని కొడాలి వ్యాఖ్యానించారు. చంద్రబాబు - పవన్ కళ్యాణ్ చేతిలో మోసపోవడానికి ఎవరు సిద్ధంగా లేరని, త‌మ వ్యూహాలు త‌మ‌కు ఉన్నాయ‌ని కొడాలి అన్నారు.

Tags:    

Similar News