ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరు ఖరారు!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు, జనసేన నాయకుడు నాగబాబు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారయ్యారు.;
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు, జనసేన నాయకుడు నాగబాబు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారయ్యారు. ఎమ్మెల్యే కోటా అభ్యర్థిగా ఆయన పేరును జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయించారు. ఈ మేరకు నాగబాబుకు నామినేషన్ దాఖలు చేయాల్సిందిగా సమాచారం అందించారు.
కొద్ది రోజుల క్రితం ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాల్లో రెండు తెదేపా, ఒకటి భాజపా భాగస్వామ్యం చేసుకున్నాయి. రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక సమయంలో నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉందని తెదేపా అధినేత చంద్రబాబు ప్రకటించారు. పవన్ కల్యాణ్ అభ్యర్థన మేరకు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకునే యోచన సీఎం చంద్రబాబు వ్యక్తం చేశారు. అయితే, ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్థానాన్ని ఆయన కోసం కేటాయించారు.
శాసనమండలి ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత నాగబాబుకు కార్పొరేషన్ ఛైర్మన్ పదవి ఇవ్వనున్నట్లు ప్రచారం జరిగింది. కానీ, చివరికి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరును ఖరారు చేయడంతో దీనిపై స్పష్టత వచ్చింది.
ఎమ్మెల్సీగా నాగబాబు ఎన్నిక లాంఛనమే కావడంతో, మంత్రి పదవిని స్వీకరిస్తారా లేదా అన్న విషయంపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. నాగబాబుకు కీలకమైన కార్పొరేషన్ చైర్మన్ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఏం జరుగుతుందన్నది వేచిచూడాలి.