ప్రశాంత్ కిశోర్ పై కేటీఆర్ అభిప్రాయం ఇది!

అవును... తాజాగా ఒక టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పొలిటికల్ స్ట్రాటజిస్టుల ప్రవర్తన ఎలా ఉంటుంది అనేది వివరించారు కేటీఆర్.

Update: 2023-11-14 11:13 GMT

ఎన్నికల సీజన్ వచ్చిందంటే... రాజకీయ పార్టీలు, నాయకులతో పాటు ఈ మధ్యకాలంలో స్ట్రాటజిల్స్ట్ ల హడావిడి కూడా ఎక్కువగా ఉంటున్న సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో ఏపీలో ప్రశాంత్ కిశోర్ టీం పనిచేసిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ కు సునీల్ కనుగోలు స్ట్రాటజిస్ట్ గా ఉన్నారు. అయితే గతంలో ప్రశాంత్ కిశోర్ బీఆరెస్స్ కు కూడా కొంతకాలం మాత్రమే పనిచేశారు.

ఈ సమయంలో పీకే టీం కేసీఆర్ వద్ద ఎందుకు పూర్తిగా పనిచేయలేదు.. అప్పట్లో పీకే కాంగ్రెస్ లోకి వెళ్తున్నారని కథనాలు వినిపించాయి.. అందుకా?.. లేక, కేసీఆర్ కు పీకేకూ చెడిందని చెప్పడానికి మరే కారణాలైనా ఉన్నాయా అనే విషయాలపై తీవ్ర చర్చలు నడిచేవి. అయితే... స్ట్రాటజిస్టులు, ముఖ్యంగా పీకే వంటి వారిపై తన అభిప్రాయాన్ని తాజాగా వెల్లడిపరిచారు కేటీఆర్.

అవును... తాజాగా ఒక టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పొలిటికల్ స్ట్రాటజిస్టుల ప్రవర్తన ఎలా ఉంటుంది అనేది వివరించారు కేటీఆర్. ఈ క్రమంలో రాజకీయ వ్యూహకర్తలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... "బాండ్ బాజా భారాత్ లాగా మేం వచ్చి అలా నిలుచుంటే.. వాళ్లే మొత్తం చేస్తారు" అని మొదలుపెట్టిన కేటీఆర్... ఈ సందర్భంగా పీకే తో వారికున్న అనుభవాన్ని పంచుకున్నారు.

"మేం కొద్ది కాలం ప్రశాంత్ కిశోర్ తో పనిచేశాం. ఇప్పుడు లేడు. లిట్రల్ గా ప్రభుత్వం ఏమి చేయాలో కూడా వాళ్లే చెబుతామంటారు. ప్రభుత్వాన్ని ఎట్టా నడపాలి.. ఏ కార్యక్రమాలు ఉండాలి.. అన్నీ వాళ్లే చెబుతామంటారు. అలాంటప్పుడు మనమందరం ఎందుకు ఇక్కడ? ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నికున్న ప్రభుత్వం, పాలకులూ వాళ్లే నడపాలి" అని అన్నారు.

ఇదే సమయంలో ఎన్నికల వ్యూహకర్తల వల్ల ఒక్క లాభం కూడా ఉందన్న కేటీఆర్.. "అధికారంలో ఉన్నప్పుడు ఎవరికి వారు గొప్పగా చెప్పేస్తారని.. ఇంద్రుడు.. చంద్రుడు.. మీరు దైవాంశ సంభూతలని చెప్పేటోళ్లే ఉంటారని.. ఆ సమయంల్మో ఎన్నికల వ్యూహకర్తలు ఉంటే మిర్రర్ మాదిరి చెబుతుంటారు" అని వ్యాఖ్యానించారు.

కాగా గతంలో కూడా ప్రశాంత్ కిశోర్ పై కేటీఆర్ ఇలాంటి వ్యాఖ్యలే చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ప్రశాంత్ కిశోర్ అనే వ్యూహకార్త ఎన్నికల్లో గెలిపించలేడు, ఓడించలేడు.. కాకపోతే కొంత శక్తిని యాడ్ చేయగలుగుతాడు అంతే అని కేటీఆర్ అన్నారు. అంతే తప్ప... ఆయనేదో వచ్చేసి మనకు తెలియందేదో చెప్పేస్తాడని కాదని వ్యాఖ్యానించారు.

దీంతో రాజకీయ వ్యూహకర్తలపై కేటీఆర్, కేసీఆర్ లకు ఉన్న అభిప్రాయం ఇదన్నమాట అని కొంతమంది అంటుండగా... కేసీఆర్ కు పీకేకు ఈ విషయంలోనే చెడిందన్నమాట అని మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు!

Full View
Full View
Tags:    

Similar News