కవిత అరెస్టు కాలేదెందుకో క్లారిటీ ఇచ్చిన కేటీఆర్

బీజేపికి బీఆర్ఎస్ బీ టీం అయితే.. కవిత మీద కేసు పెట్టేవారా? అని ప్రశ్నించిన మాజీ మంత్రి కేటీఆర్.. కవిత అరెస్టుకాకపోవటానికి కారణం సుప్రీంకోర్టు జోక్యమే తప్పించి.

Update: 2024-01-13 05:30 GMT

బీజేపీకి బి టీం కావటం అన్నది ఇప్పుడే కాదు ఎప్పుడూ జరగదని తేల్చేశారు మాజీ మంత్రి.. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. తాజాగా తెలంగాణ భవన్ లో వరుస సమావేశాల్ని నిర్వహిస్తున్న ఆయన.. శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీజేపీతో కలిసి బీఆర్ఎస్ వెళ్లేలా ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా ప్రచారం జరుగుతున్న వేళ.. దానికి సంబంధించిన స్పష్టతతో పాటు.. ఎమ్మెల్సీ కవిత అరెస్టు కాకపోవటం వెనుకున్న అసలు కారణాన్ని వెల్లడించారు కేటీఆర్.

బీజేపికి బీఆర్ఎస్ బీ టీం అయితే.. కవిత మీద కేసు పెట్టేవారా? అని ప్రశ్నించిన మాజీ మంత్రి కేటీఆర్.. కవిత అరెస్టుకాకపోవటానికి కారణం సుప్రీంకోర్టు జోక్యమే తప్పించి.. బీజేపీతో ఉన్న సంబంధాల కారణమన్నది తప్పుడు ప్రచారంగా తేల్చేశారు. కాంగ్రెస్.. బీజేపీలు కమ్మక్కై బీఆర్ఎస్ ను దెబ్బ తీయాలని చూస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఈ రెండు పార్టీల కుమ్మక్కు కారణంగానే రెండు ఎమ్మెల్సీల ఉప ఎన్నికల్ని వేర్వేరుగా నోటిఫికేషన్ ఇవ్వటాన్ని ప్రస్తావించారు.

కేంద్ర మంత్రి అమిత్ షాను ముఖ్యమంత్రి రేవంత్ కలిసినంతనే ఎమ్మెల్సీ ఉప ఎన్నికల విధానం మారినట్లుగా ఆరోపించారు. మతాన్ని బీజేపీ రాజకీయం కోసం వాడుకుంటోందని.. తాము కూడా యాదాద్రి అక్షతలను నల్గొండ.. భువనగిరిల్లో పంచితే గెలిచే వాళ్లమేమో అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. బీజేపీ వాళ్లు రాజకీయంగా హిందువులు అయితే.. కేసీఆర్ మతాన్ని మతంగా మాత్రమే చూసే హిందువన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతుందన్న కేటీఆర్.. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యవతిరేక వైఖరుల్ని ఎప్పటికప్పుడు ఎండగడతానని పేర్కొన్నారు. తాజా ఓటమి ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిదేనని వ్యాఖ్యానించటం గమనార్హం.

Tags:    

Similar News