ఆరు గ్యారంటీలు కాదు .. ఈ ఆరు ఖచ్చితంగా ఉండాలి
కాంగ్రెస్ ప్రభుత్వ ఆరు గ్యారంటీలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు
కాంగ్రెస్ ప్రభుత్వ ఆరు గ్యారంటీలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆరు గ్యారంటీల సంగతి ఏమో గానీ తెలంగాణలో ఉన్న ప్రజలు ప్రతి ఒక్కరు ఆరు వస్తువులను మాత్రం తప్పనిసరిగా సమకూర్చుకోవాలని సూచించాడు. ఇన్వర్టర్, ఛార్జింగ్ బల్బులు, టార్చ్ లైట్లు, క్యాండిల్స్, జనరేటర్స్, పవర్ బ్యాంక్ లను దగ్గర పెట్టుకోవాలని అన్నాడు.
మే 13న తెలంగాణ ప్రజలు తెలివిగా ఓటు వేయాలని, తెలంగాణలో ఉన్నది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదు .. కాంగ్రెస్ ప్రభుత్వం అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని కేటీఆర్ అన్నాడు. మంగళవారం రాత్రి హైదరాబాద్ లో పలు చోట్ల పెద్ద ఎత్తున వర్షం కురిసింది. దీంతో చాలా ప్రాంతాలలో నీళ్లు చేరి, గాలి వానకు స్థంబాలు పడిపోయి కరంటు లేక ప్రజలు అవస్థలు ఎదుర్కొన్నారు.
కొన్ని చోట్ల 24 గంటల వరకు కరంటు సరఫరా పునరుద్దరణ జరగలేదు. ఈ నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అసలు ఎక్కడా కరంటు పోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే కరంటు పోతున్నట్లు బీఆర్ఎస్ ప్రచారం చేస్తుందని అన్నాడు. ఈ నేపథ్యంలో కేటీఆర్ ఆరు వస్తువులను గ్యారంటీగా ఉంచుకోవాలని చెప్పిన సెటైర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.