జానాకు పుత్రోత్సాహం.. సాగర్ గెలుపు ఖాయం!
బ్యాలెట్ ఓట్ల ఫలితాల్లో.. 5 వేల ఓట్ల మెజారిటీ దక్కించుకున్న జైవీర్.. తర్వాత ఈవీఎంల ఓట్ల లెక్కింపు లో మరింత ముందజలో ఉన్నారు
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జానారెడ్డి ఆశలు ఫలించాయి. ప్రస్తుత ఎన్నికల్లో తాను తప్పుకొని .. తన కుమారుడుజైవీర్ రెడ్డికి టికెట్ ఇప్పించిన ఆయన తన కుమారుడి గెలుపు కోసం.. ఎంతో శ్రమించారు. అంతేకాదు.. ఇంటింటికీ తిరిగారు. అనేక సభలు పెట్టారు. పొరుగు పార్టీలలోని వారిని కూడా తనవైపు తిప్పుకొన్నారు. మొత్తానికి జానా చాలా ప్రయత్నాలే చేశారు.
ఫలితంగా.. జానాకు పుత్రోత్సాహం ఘడియ వచ్చేసింది. నాగార్జున అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన.. కుందూరు జైవీర్‌రెడ్డి ప్రత్యర్థి బీఆర్ ఎస్ నేత నోముల భగత్ పై భారీ ఆధిక్యంతో దూసుకుపోతు న్నారు. ప్రతి రౌండ్‌లోనూ భగత్ వెనుకబడడం గమనార్హం. ఇక, ఇక్కడ బీజేపీ ఉనికే లేకుండా పోవడం గమనార్హం. దీంతో సాగర్ నియోజకవర్గంలో జైవీర్ రెడ్డి గెలుపు తథ్యమనే మాట వినిపిస్తోంది.
బ్యాలెట్ ఓట్ల ఫలితాల్లో.. 5 వేల ఓట్ల మెజారిటీ దక్కించుకున్న జైవీర్.. తర్వాత ఈవీఎంల ఓట్ల లెక్కింపు లో మరింత ముందజలో ఉన్నారు. మొత్తానికి కుందూరు కలలు ఫలించే సమయం వచ్చేసిందనే చెప్పాలి. సుదీర్ఘ రాజకీయ ప్రస్తానం ఉన్న కుందూరు జానారెడ్డి..గతంలోటీడీపీ నుంచి పోటీ చేసి విజయం దక్కించుకుని ఎన్టీఆర్ హయాంలో రవాణా శాఖ మంత్రిగా,తర్వాత.. కాంగ్రెస్‌లోకి వచ్చాక హోం శాఖ మంత్రిగా కూడా పనిచేశారు.