అప్పులున్నాయ్.. ఆస్తులు చెప్పం.. తెలంగాణ సమగ్ర సర్వేలో సంగతిది

20 ఏళ్ల కిందట ఎకరం 50 వేలు కూడా లేని భూమి ఇప్పుడు కోటిపైనే పలుకుతోంది.

Update: 2024-11-18 14:30 GMT

ఒకప్పటిలా కాదు.. ఇప్పుడు భూమి అంటే బంగారం కంటే ఎక్కువైపోయింది. 20 ఏళ్ల కిందట ఎకరం 50 వేలు కూడా లేని భూమి ఇప్పుడు కోటిపైనే పలుకుతోంది. దీంతో నాలుగైదు ఎకరాలున్న సామాన్య రైతులు కూడా కోటీశ్వరులే. ఇక ఎక్కడ వంద రెండు వందల గజాల స్థలం ఉన్నా దాని విలువ రూ.లక్షల్లోనే ఉంటోంది. నాలుగైదు స్థలాలు కొనుక్కుని పెట్టుకున్నవారు దర్జాగా జీవిస్తున్నారు. ఇదీ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా తెలంగాణలో పరిస్థితి. ఇలాంటి సమయంలో రాష్ట్రంలో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో ఆసక్తికర సంఘటనలు ఎదురవుతున్నాయి.

..అది తప్ప

తెలంగాణలో సరిగ్గా ఏడాది కిందట జరిగిన ఎన్నకల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రధాన హామీ కుల గణన. వాస్తవానికి దేశవ్యాప్తంగా కుల గణన అనేది కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పదేపదే ఇదే అంశం చెబుతున్నారు. ఈ కోణంలోనే అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చేపట్టింది. ఉద్యోగం, వ్యాపారం, కులం సహా పలు వివరాలు జోడించేందుకు క్రమ సంఖ్యలు ఇచ్చారు. ఎన్యుమరేటర్లు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. ప్రజలు మాత్రం అన్ని వివరాలు చెబుతున్నారు ఒక్కటి తప్ప..

కులాన్నీ వెల్లడిస్తున్నారు..

తెలంగాణలో సర్వేలో ప్రజలు తమ సామాజిక వర్గాన్ని బాహాటంగానే చెప్పేస్తున్నారు. తాము ఏ వర్గానికి చెందినవారమో తెలియజేయడంలో సందేహించడం లేదు. అయితే, అతి కొందరు మాత్రం అన్ని వివరాలు వెల్లడించేందుకు కొందరు ఇష్టపడడంలేదు. ముఖ్యంగా ఆస్తుల విషయంలో గోప్యంగా వ్యవహరిస్తున్నారు.

75 ప్రశ్నలతో..

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సర్వే ప్రశ్నావళిలో 75 ప్రశ్నలు ఉన్నాయి. అంటే, సేకరణ సుదీర్ఘ ప్రక్రియే. కానీ, ఓపికగానే ఎన్యుమరేటర్లు సమాచారం సేకరిస్తున్నారు. అయితే, వీరిని ప్రజలు కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. వీటికి ఎన్యుమరేటర్ల వద్ద సరైన సమాధానం ఉండడం లేదు. ఇక ప్రశ్నావళిలోని 43 ప్రశ్నలకు ప్రజలు చెప్పిన సమాధానాలను బట్టి.. ప్రభుత్వం రూపొందించిన బుక్‌ లెట్‌ చూసి సంబంధిత కోడ్‌ నమోదు చేయాలి.

ఆస్తులు వెల్లడిస్తే ఇంకేమైనా ఉందా?

భూముల విలువ పెరిగిన నేపథ్యంలో తెలంగాణ ఆస్తుల వివరాలు వెల్లడించేందుకు ప్రజలు నిరాకరిస్తున్నారు. తమ ఆధార్ సహా వివరాలు తీసుకుంటున్నందున ఏమైనా ఇబ్బంది వస్తుందేమోనని కంగారు పడుతున్నారు. అయితే, ఇందులో ఆందోళన చెందాల్సినది ఏమీ లేదు. ఎందుకంటే సమగ్ర సర్వే మెగా హెల్త్ చెకప్ లాంటింది అని ప్రభుత్వం ప్రకటించింది.

Tags:    

Similar News