న్యాస్ సరస్సు... న్యోస్ గ్రామాన్ని ఒక్కరాత్రిలో మాయం చేసింది!
అనంతరం సరస్సుకు సమీపంగా ఉన్న ఆ గ్రామంలోని 1,746 మంది ఉన్నపలంగా చనిపోయారు. ఇందులో గరిష్టంగా జనం నిద్రలోనే మృతి చెందగా.
ఇది అందమైన ప్రపంచం. ఈ అందమైన ప్రపంచంలో మరెంతో అందమైన ప్రదేశాలు. వాటికింద ప్రపంచానికి తెలియని ప్రమాధాలు! చంద్రుడిపై కాలుమోపగల మనిషికి... భూమిపైనే ఎన్నో అంతుపట్టని రహస్యాలు దాగిఉన్నాయని కొన్ని సంఘటనలు గుర్తుచేస్తుంటాయి. అందులో న్యాస్ సరస్సు పక్కనున్న న్యోస్ గ్రామం హిస్టరీ ఒకటి!
అవును... న్యాస్ సరస్సుని ఆనుకుని ఉన్న న్యోస్ గ్రామం ఆగస్టు 21 - 1986లో ఒక్క రాత్రిలో కనిపించకుండా పోయింది. ఆ గ్రామంలో ఉన్న చిన్న కీటకం నుంచి మనిషి వరకూ అందరూ చనిపోయారు. విచిత్రంగా ఆ శవాలపై ఒక్క ఈగ కూడా వాలలేదు. కారణం... ఈగకూడా మరణించింది! ఈ ఘటనకు గల కారణంపై ఇప్పటికీ స్పష్టత లేకపోవడం గమనార్హం!
వివరాళ్లోకి వెళ్తే... పశ్చిమ ఆఫ్రికాలోని కామెరూన్ లో సముద్ర మట్టానికి 1090 మీటర్ల ఎత్తులో న్యోస్ అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో న్యాస్ అనే సరస్సు ఉంది. ఈ సరస్సు సుమారు 400 సంవత్సరాల క్రితం ఏర్పడిందని చెబుతారు. దీని లోతు 200 మీటర్ల పైనే అని... దీని కింద శిలాద్రవం ఉందని చెబుతారు.
ఆ సంగతి అలా ఉంటే... ఏమి జరిగిందో తెలియదు.. ఎలా జరిగిందో అసలు తెలియదు.. ఎందుకు జరిగిందే ఎవ్వరికీ తెలియదు.. ఇప్పటికీ స్పష్టంగా తెలియదు! సడన్ గా నాటి రాత్రి 9 గంటల ప్రాంతంలో సరస్సు మీదనుంచి బలమైన గాలులు వచ్చాయి!
అనంతరం సరస్సుకు సమీపంగా ఉన్న ఆ గ్రామంలోని 1,746 మంది ఉన్నపలంగా చనిపోయారు. ఇందులో గరిష్టంగా జనం నిద్రలోనే మృతి చెందగా... మిగిలిన వారు నడుస్తున్నవారు నడుస్తున్నట్లు, కుర్చున్న వారు కుర్చున్నట్లు మృతి చెందారు. నాటి భయనక ఘటనలు గుర్తు చేసుకుని ఇప్పటికీ వణికిపోతుంటారు స్థానికులు!
ఈ ఘటనలో సుమారు 3,500 వ్యవసాయ జంతువులు చనిపోయినట్లు గణాంకాల్లో వెల్లడైంది. ఆ గ్రామం సమీపంలో న్యాస్ అనే సరస్సు ఉందని, దానిలోంచి కార్బన్ డయాక్సైడ్ ఫ్రీక్ ఫ్లూమ్ పెరగడంతోనే అందరూ మరణించినట్లుగా అధికారులు అనుమానాలు వ్యక్తం చేశారు.
ఈ సమయంలో సుమారు 1.6 మిలియనల టన్నుల కార్బన్ డయాక్సైడ్ విడుదలైందని, సరిగ్గా లోయకు సమీపంలోని వ్యక్తులంతా పీల్చడంతోనే చనిపోయారని అధికారులు చెప్పుకొచ్చారు! అయితే... ప్రాణాలతో బయటపడిన వ్యక్తులు మాత్రం సరస్సు నుంచి కుళ్లిన కోడిగుడ్ల వాసన వచ్చినట్లు చెప్పారు.
అదేవిధంగా... ఈ ఉపద్రవం సంభంవించిన సమయంలో న్యాస్ నది జలాలు కూడా ఆ రోజు నీలిరంగుకు బదులు ఎరుపు రంగులోకి మారిపోయింది! అయితే ఈ విషయంలో ఏం జరింగిందనేది ఇప్పటికీ ఓ అంతుచిక్కని మిస్టరీలా ఉండిపోవడం గమనార్హం!
1986 లో ఇక్కడ జరిగిన విపత్తు కారణంగా ఈ సరస్సు విస్తృతంగా ప్రసిద్ది చెందింది. 900 మీటర్లు వెడల్పు, 1400 మీటర్లు పొడవు కలిగి ప్రశాంతంగా కనిపించే ఈ సరస్సుల్లో ఏమి దాగిఉందనేది ఇప్పటికీ తెలియలేదు! ఈ సంఘటన జరిగిన సమయంలో గడ్డి నల్లగా అయిపోవడంతోపాటు.. మొక్కలు వంకర్లు తిరిగిపోవడం గమనార్హం!