బాలకృష్ణ ఇంట్లో కాల్పులకు జూ. ఎన్టీఆర్ కి సంబంధం ఉందట!

దివంగత ముఖ్యమంత్రి, నందమూరి తారకరామారావు వర్ధంతి సందర్భంగా ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కార్యక్రమాలు జరుగుతున్న సంగతి తెలిసిందే

Update: 2024-01-18 09:51 GMT

దివంగత ముఖ్యమంత్రి, నందమూరి తారకరామారావు వర్ధంతి సందర్భంగా ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కార్యక్రమాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఈ రోజు వేకువ జామునే జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రాం లు ఎన్టీఆర్ ఘాట్ కి వెళ్లి నివాళులు అర్పించారు. అనంతరం బాలయ్యతో పాటు మరికొంతమంది కుటుంబ సభ్యులు ఘాట్ కు చేరుకుని నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బాలయ్య చేసిన వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.

ఎన్టీఆర్ ఘాట్ నుంచి తారక్ వెళ్లిన అనంతరం అక్కడకు చేరుకున్న బాలయ్య... ఫ్లెక్సీలను ఇప్పుడే తొలగించాలంటూ హుకుం జారీచేసినట్లు చెబుతున్న వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ సమయంలో ఈ విషయాలపై ఇప్పటికే తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇందులో భాగంగా వెయ్యిమంది బాలయ్యలు వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ వెంట్రుక కూడా పీకలేరంటూ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఘాటుగా స్పందించారు. ఈ సమయంలో లక్ష్మీపార్వతి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

అవును... సీనియర్ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఘాట్ వద్ద తారక్ ఫ్లెక్సీలను తొలగించిన విషయం వైరల్ అవుతున్న నేపథ్యంలో... దివంగత ఎన్టీఆర్ సతీమణి, నందమూరి లక్ష్మీపార్వతి స్పందించారు! ఇందులో భాగంగా... జూనియర్ ఎన్టీఆర్ పై బాలయ్యకు ఉన్న ఆగ్రహం, ఆక్రోశం ఇప్పటిది కాదని అన్నారు. ఈ సందర్భంగా నాడు బాలయ్య ఇంట్లో జరిగిన కాల్పుల ఘటనను ప్రస్థావించారు.

ఈ విషయాలపై స్పందించిన లక్ష్మీపార్వతి... ఇలాంటి విషయాలు చూస్తుంటే వారి అహంకారం, సంకుచితత్వం పరాకాష్టకు చేరిపోయినట్లు అనిపిస్తుందని అన్నారు. తనను కుటుంబం నుంచి వెలేసినట్లే.. జూనియర్ నీ వెలేశారని అన్నారు. సీనియర్ ఎన్టీఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆరే అన్నస్థాయిలో పేరు తెచ్చుకోవడంతో జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు.

ఈ సందర్భంగా చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే అంటూ స్పందించిన లక్ష్మీపార్వతి... బెల్లంకొండ సురేష్ ని కాల్చడానికి కూడా జూనియర్ ఎన్టీఆర్ సినిమానే కారణం అని అన్నారు. నాడు థియేటర్లలో నుంచి తన సినిమా తీసేసి.. జూనియర్ ఎన్టీఆర్ "ఆది" సినిమా వెయ్యడంపైనే గొడవ జరిగి బాలయ్య కాల్పులు జరిపారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ స్థాయిలో అహంకారం పెరిగిపోయిందని అన్నారు.

అలా నాడు బెల్లంకొండ సురేష్ పై కాల్పులు జరగడానికి కూడా జూనియర్ ఎన్టీఆర్ పై ఉన్న ఆగ్రహం, ఆక్రోశమే కారణం అంటూ నందమూరి లక్ష్మీపార్వతి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. మరి ఈ కామెంట్స్ పై ఏవైపు నుంచైనా వివరణలు, ఖండనలు ఏమైనా వస్తాయో లేదో వేచి చూడాలి!

Tags:    

Similar News