అక్కడ శాంతిభద్రతలు భేష్... భారత్ కంటే బెటర్ గా 78 దేశాలు!

ఇప్పుడు ఈ యుద్ధంలోకి రష్యా తరుపున ఉత్తర కొరియా కూడా ఎంట్రీ ఇచ్చింది.

Update: 2024-10-28 01:30 GMT

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో భారీ యుద్ధాలు జరుగుతున్నాయి. 2022లో మొదలైన రష్యా – ఉక్రెయిన్ వార్ అవిరామంగా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు ఈ యుద్ధంలోకి రష్యా తరుపున ఉత్తర కొరియా కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇక ఇజ్రాయెల్ – హమాస్ లతో మొదలైన యుద్ధం నేడు ఇరాన్ వరకూ వ్యాపించింది.

ఈ క్రమంలో ఇప్పటికే గాజా అల్లకల్లోలమవ్వగా, ఇప్పుడు లెబనాన్ పరిస్థితి అదే అని అంటున్నారు. ఇలా పశ్చిమాసియాలో తీవ్ర భయానక వాతావరణ నెలకోంది. మూడో ప్రపంచ యుద్ధ మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఈ సమయంలో... శాంతిభద్రతల విషయంలో బెస్ట్ గా ఉంటూ ప్రశాంతంగా ఉండే దేశాల జాబితా తాజాగా విడుదలైంది.

అవును... ప్రపంచ వ్యాప్తంగా లా అండ్ ఆర్డర్ లో బెస్ట్ ప్లేస్ లో పలు దేశాలు ఉన్నాయి. ఈ సందర్భంగా 142 దేశాలకు ర్యాంకులు ఇచ్చారు. ఈ సమయంలో ఆయా దేశాలకు ర్యాంకులు ఇవ్వడానికి వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ రూల్ ఆఫ్ లా ఇండెక్స్ లోని ఎనిమిది అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. ఈ క్రమంలోనే ర్యాంకులను నిర్ధారిస్తారు.

ఇందులో భాగంగా... బహిరంగ ప్రభుత్వాన్ని కలిగి ఉండటం, ప్రభుత్వ అధికారంపై స్వాభావిక తనిఖీలను నిర్వహించడం, అవినీతి లేకపోవడం, ప్రాథమిక హక్కులను నిర్ధారించడం, ఆర్డర్ - భద్రతకు మద్దతు ఇవ్వడం, నిబంధనలను అమలు చేయడం, పౌర న్యాయాన్ని నిర్వహించడం, నేర న్యాయాన్ని సమర్థించడం వంటి అంశాలు ఉంటాయి.

ఈ నేపథ్యంలో తాజాగా వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ రూపొందించిన సూచీ ప్రకారం ఈ జాబితాలో డెన్మార్ అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానాల్లో నార్వే, మూడో స్థానంలో ఫిన్లాండ్ ఉన్నాయి. ఇక అగ్రరాజ్యం అమెరికా ఈ జాబితాలో 26వ ర్యాంక్ దక్కించుకోగా యునైటెడ్ కింగ్ డమ్ 15 స్థానంలో యూఎస్ కంటే బెటర్ గా ఉంది.

ఇదే సమయంలో ఈ జాబితాలో భారతదేశం ర్యాంకు 79గా ఉండగా.. దాయాదీ దేశం పాకిస్థాన్ 129వ స్థానంలో ఉంది. ఇక అన్నింటికంటే చివరిగా 142వ స్థానంలో వెనిజులా ఉందని ఈ నివేదిక తెలిపింది.

వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ లో టాప్ 10 దేశాలు!:

డెన్మార్క్

నార్వే

ఫిన్లాండ్

స్వీడన్

జర్మనీ

న్యూజిలాండ్

లగ్జెంబర్గ్

నెథర్లాండ్స్

ఐర్లాండ్

ఎస్టోనియా

Tags:    

Similar News