రతన్ టాటాకు సంప్రదాయ వైద్యం చేసింది వీరే... ఏమిటీ వర్మమ్ థెరపి?

ఈ సందర్భంగా రతన్ జీతో తన అనుభవాలను పంచుకున్నారు లక్ష్మణన్!

Update: 2024-10-14 16:30 GMT

రతన్ టాటా ఈ నెల 9వ తేదీ రాత్రి 11:30 గంటల ప్రాంతంలో ముంబై లోని ఓ ఆస్పత్రిలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా దేశం మొత్తం ఆయనకు నివాళులు అర్పించింది! దేశానికి ఆయన చేసిన సేవలు తలచుకుంటూ పలువురు సొషల్ మీడియా వేదికగా తమ తమ అనుభవాలను, అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ నేపథ్యంలో టాటాకు వైద్యం చేసిన దంపతుల వివరాలు తెరపైకి వచ్చాయి.

అవును... అత్యంత సింపుల్ గా జీవిస్తూ.. దేశ పారిశ్రామిక రంగం అభివృద్ధి, పరోపకారం, జంతువులపై దయాగుణంతో బ్రతికిన రతన్ టాటా... సాంప్రదాయ వైద్యాన్ని బాగా నమ్మేవారంట! ఈ క్రమంలో ఆయనకు తమిళనాడుకు చెందిన కోము లక్ష్మణన్ అనే వర్మమ్ థెరపిస్ట్ సంప్రదాయ వైద్యం చేసేవారు. ఈ సందర్భంగా రతన్ జీతో తన అనుభవాలను పంచుకున్నారు లక్ష్మణన్!

వివరాళ్లోకి వెళ్తే... కోయంబత్తురులోని మరుధమలై కొండల్లో సంప్రదాయ ఔషధ క్లీనిక్ ను నడుపుతుంటారు లక్షణన్. ఆయన వర్మమ్ అనే థెరపీ అనే సాంప్రదాయ వైద్యంలో ఎక్స్ పర్ట్. ఈ క్రమంలో 2019 జనవరిలో టాటా సన్స్ డైరెక్టర్ ఆర్కే కృష్ణకుమార్ తమకు ఫోన్ చేశారని.. ఓ వీవీఐపీకి వైద్యం చేయడం కోసం ముంబై రావాల్సి ఉంటుందని తమతో చెప్పారని అన్నారు.

అయితే... దీనికి సమాధానంగా స్పందించిన లక్ష్మణన్.. సాధారణంగా తమ దగ్గరకే వచ్చి వైద్యం చేయించుకుంటారు తప్ప తాము వ్యక్తిగతంగా బయటకు వెళ్లి ఎవరికీ చికిత్స చేయమని.. కృష్ణకుమార్ కు చెప్పినట్లు తెలిపారు. ఈ క్రమంలో కొన్ని నెలలు గడిచిన తర్వాత.. తిరిగి అదే ఏడాది అక్టోబర్ లో కృష్ణకుమార్ మళ్లీ కాల్ చేశారని చెప్పారు లక్ష్మణన్.

దీంతో.. అదే నెలలో తన భార్య మనోన్మణితో కల్లిసి ముంబై వెళ్లినట్లు తెలిపారు. అక్కడకు వెళ్లిన లక్ష్మణన్... ముంబైలోని రతన్ టాటా ఇంటికి సమీపంంలోని గెస్ట్ హౌస్ లో ఉన్నట్లు చెప్పారు. ఈ సమయంలో రోజూ రతన్ టాటా ఇంటికి వెళ్లి సుమారు 2 గంటలు చికిత్స చేసేవాడినని తెలిపారు.

తాము చేసిన చికిత్సతో రతన్ టాటా చాలా సంతృప్తి చెందారని.. ఈ వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారని వెల్లడించారు. అలా చికిత్స పూర్తైన తర్వాత భార్యతో కలిసి లక్ష్మణన్ తిరిగి తమిళనాడుకు వచ్చేయగా.. మళ్లీ ఒక నెల రోజుల తర్వాత కృష్ణకుమార్ నుంచి ఫోన్ రావడంతో తిరిగి ముంబై బయలుదేరి వెళ్లినట్లు తెలిపారు.

ఆ సమయంలోనూ సుమారు 20 నుంచి 25 గంటలు చికిత్స చేసినట్లు వెల్లడించారు. ఆ సమయంలో తమతో రతన్ టాటా ఎంతో సన్నిహితంగా మాట్లాడేవారని.. అంత గొప్ప వ్యక్తి కూడా చాలా సాదాసీదాగా ఉండేవారని.. తెలిపారు. ఈ సమయంలో పెళ్లి విషయం ఎత్తగానే.. అది "విధి ఆడిన వింత నాటకం" అని రతన్ టాటా సమాధానం చెప్పారని లక్ష్మణన్ తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన సాధారణ జీవనశైలినే అనుసరిస్తరని చెప్పిన లక్షణన్.. తమ పట్ల ఆయన చూపిన ప్రేమ ఎన్నటికీ మరువలేనిదని చెప్పారు. ఆయన మరణవార్త విన్నవెంటనే ముంబై వెళ్లి ఆయనకు నివాళులు అర్పించినట్లు తెలిపారు.

Tags:    

Similar News