జగన్ కోసం జైలుకు వెళ్లేందుకు నోనో...!
వైసీపీకి చాలా మంది నాయకులు బై చెప్పేందుకు రెడీ అయ్యారు. వీరిలో కొందరు పొరుగు పార్టీల్లోకి వెళ్లేం దుకు రెడీ అయ్యారు.
వైసీపీకి చాలా మంది నాయకులు బై చెప్పేందుకు రెడీ అయ్యారు. వీరిలో కొందరు పొరుగు పార్టీల్లోకి వెళ్లేం దుకు రెడీ అయ్యారు. మరికొందరు మాత్రం.. పార్టీకి దూరంగా ఉంటూ..మౌనంగా ఉండాలని భావిస్తున్నా రు. మరి దీనికి కారణం ఏంటి? ఎందుకు? అంటే.. అనుచరుల వద్ద కీలక నాయకులు చెప్పుకొన్న కారణా లను విశ్లేషిస్తే.. చాలా ఆశ్చర్యంగా ఉంది. వచ్చే ఐదేళ్లపాటు వైసీపీలోనే ఉన్నా తమకు ఎలాంటి ఊరట ఉండదని నాయకులు భావిస్తున్నారు.
పైగా వచ్చే అన్ని ఎన్నికల్లోనూ వైసీపీకి పరాభవమే తప్ప.. ప్రయోజనం కనిపించదు. పార్టీలో ఉంటే.. ప్రచారం చేయాలి.. పోయిన పరువును కాపాడుకునేందుకు నానా తిప్పలు పడాలి. ఇవన్నీ చేయాలంటే.. ఆర్థికంగా సొమ్ములు కరిగించాలి. పోనీ.. ఇన్నింటికీ సిద్ధమైనా ప్రభుత్వ పక్షం నుంచి ఎదురయ్యే కేసులు.. దాడులు.. వంటివి ఎదుర్కొనడం మరో పెద్ద రిస్క్. ఇవన్నీ.. ఎలా ఉన్నా.. పద్మవ్యూహంలాంటి రాజకీయ చక్ర బంధంలో చిక్కుకుని.. తమ భవిష్యత్తును ఎరగా పెట్టాలనేది నాయకుల వాదన.
పోనీ.. ఇన్నీ చేసి.. పార్టీ కోసం కష్టపడి.. జగన్ కోసం జైలుకు వెళ్లేందుకు రెడీ అయినా.. చివరకు తమ ఆశలు కోరికలు .. అన్నీ.. తాడేపల్లి ప్యాలస్ ముందు.. పడిగాపులు పడాలన్నది నాయకుల నిర్వేదం. అంటే.. ఎన్నికల్లో టికెట్ దక్కుతుందో లేదో చెప్పలేని పరిస్థితి . ఎందుకంటే.. తాజాగా జరిగిన ఎన్నికల్లో నాయకులుకు ఇదే జరిగింది. అప్పటి వరకు ఎంతో కష్టపడి .. గడపగడపకు తిరిగిన వారిని పక్కన పెట్టారు. సో.. ఈ నేపథ్యంలో ఇప్పుడు.. వచ్చే 5 సంవత్సరాలు కష్టపడినా.. ప్రయోజనం ఏంటన్నదే నాయకుల ప్రశ్న.
అందుకే.. ఐదేళ్లు సర్కారుకు వ్యతిరేకంగా పోరాడి.. వైసీపీని గాడిలో పెట్టేందుకు చెమటోడ్చి.. చివరకు పోలీసులతో దెబ్బలు తిని.. జైళ్లకు వెళ్లేందుకు నాయకులు రెడీగా లేరు. ముఖ్యంగా కేడర్ కూడా అందు కు సిద్ధంగా లేదు సో.. అందుకే పార్టీ నుంచి నాయకులు తప్పుకొంటున్నారు. ఇది అవకాశ వాద రాజకీయం అని అనిపించొచ్చు.. కానీ రాజకీయం అంటేనే అవకాశవాదం. పార్టీలైనా.. గెలుపు `అవకాశం` ఉంటేనే కదా.. టికెట్లు ఇస్తాయి. అంటే.. ఎక్కడైనా ఒక్కటే రాజకీయం. తమ అవసరం, అవకాశం రెండు పట్టాలపైనే పరుగులు పెడతాయి.