కుంకం భ‌రిణ‌లు రెడీ... ఉండ‌మ్మా.. బొట్టు పెడ‌తా!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓట‌ర్ల‌ను త‌మ‌వైపు తిప్పుకొనేందుకు ఉన్న అన్ని మార్గాల‌నూ నాయ‌కులు అమ‌లు చేసేస్తున్నారు.

Update: 2023-11-28 13:30 GMT

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓట‌ర్ల‌ను త‌మ‌వైపు తిప్పుకొనేందుకు ఉన్న అన్ని మార్గాల‌నూ నాయ‌కులు అమ‌లు చేసేస్తున్నారు. ఇక‌, నాయ‌కుల‌కు తోడు.. వారి కుటుంబ స‌భ్యులు, భార్యామ‌ణులు, కుమార్తెలు కూడా రంగంలోకి దిగుతున్నారు. ముఖ్యంగా మంగ‌ళ‌వారం సాయంత్రంతో ప్ర‌చారానికి స‌మ‌యం ముగిసి పోతున్న నేప‌థ్యంలో ఇక‌, ఇంటింటి ప్ర‌చారం చేసుకునేందుకు అవ‌కాశం ఉంది. అభ్య‌ర్థి లేదా.. ఆయ‌న భార్య‌(వెసులు క‌ల్పించారు) ఇంటింటికీ తిరుగుతూ.. సైలెంట్‌గా ప్ర‌చారం చేసుకోవ‌చ్చు.

దీనినే త‌మ‌కు అనుకూలంగా మార్చుకున్న నాయ‌కులు స‌తీమ‌ణులు కుంకం భ‌రిణ‌లు రెడీ చేసుకుని.. ఇంటింటికీ వెసులు బాటు ఉన్నంత వ‌ర‌కు ఒంట‌రిగా వెళ్లేందుకు రెడీ అయ్యారు. రేవంత్ రెడ్డి స‌తీమ‌ణి, హ‌రీష్ రావు స‌తీమ‌ణి, ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి స‌తీమ‌ణి(ఈవిడ కూడా అభ్య‌ర్థే), ఇక‌, మ‌ల్లారెడ్డి కోడ‌లు.. ఇలా అనేక మంది నాయ‌కుల ఇంటి ఆడ‌పడుచులు, స‌తీమ‌ణులు.. కుంకం భ‌రిణ‌లు రెడీ చేసుకుని.. ఉండ‌మ్మా బొట్టు పెడ‌తా! అంటూ.. బ‌య‌లు దేరేందుకు రెడీ అయ్యారు.

ఎన్నిక‌ల సంఘం నియ‌మాల ప్ర‌కారం.. డ‌ప్పులు, ప్ర‌చారాలు.. మైకులు, వాహ‌నాలు, అనుచ‌రుల‌తో మంగ‌ళ‌వారం సాయంత్రం వ‌ర‌కు ప్ర‌చారం చేసుకునే అవ‌కాశం ఉంది. ఆ త‌ర్వాత‌.. అభ్య‌ర్థులు లేదా వారి భాగ‌స్వాములు.. ఒంట‌రిగా.. సైలెంట్‌గా ఇంటింటికీ ప్ర‌చారం చేసుకునే అవ‌కాశం ఉంది. దీనిని స‌హ‌జంగా నాయ‌కులు వినియోగించుకోరు. కానీ, ఇప్పుడు తెలంగాణ ఎన్నిక‌ల నేప‌థ్యంలో త‌మ‌కు అనుకూలంగా ఉంటుంద‌ని భావిస్తున్న ప్రాంతాల్లో నాయ‌కుల స‌తీమ‌ణులు వాలిపోతున్నారు. మ‌రి ఏమేర‌కు ఓట‌రును త‌మ‌వైపు తిప్పుకుంటారో చూడాలి.

Tags:    

Similar News