పర్యాటకులు వద్దంటున్న ప్రజలు... కొత్త డిమాండ్!
అవును... స్పెయిన్ లోని బార్సిలోనాకు చెందిన నగర వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా... పర్యాటకుల తాకిడి పెరిగిపోతుండటం వల్ల స్థానిక వ్యాపారాలు దెబ్బతింటున్నాయని..
సాధారణంగా టూరిజం అభివృద్ధి చెందితే ఆదాయం పెరుగుతుందని.. ఫలితంగా దేశాభివృద్ధికి సహకరిస్తుందని చాలా దేశాలు భావిస్తుంటాయి. ఈ సమయంలోనే టూరిస్టులను ఆకర్షించడానికి పలు దేశాలు వీసా కండిషన్స్ ని కూడా పక్కనపెట్టి, ఆఫర్స్ ప్రకటిస్తుంటాయి. అయితే తాజాగా టూరిస్టులు తమ దేశాన్ని వదిలి వెళ్లాలని కోరుతున్నారు బార్సిలోనా ప్రజలు. దీనికి వారు ఓ బలమైన కారణం చెబుతున్నారు.
అవును... స్పెయిన్ లోని బార్సిలోనాకు చెందిన నగర వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా... పర్యాటకుల తాకిడి పెరిగిపోతుండటం వల్ల స్థానిక వ్యాపారాలు దెబ్బతింటున్నాయని.. కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయిందని వారు వాపోతున్నారు. పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉండటం వల్లే పదేళ్లలో కాస్ట్ ఆఫ్ లివింగ్ 68శాతం పెరిగిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ర్యాలీలు చేస్తున్నారు.
మాస్ టూరిజం స్పెయిన్ లో అత్యధికంగా సందర్శించే నగరం అయిన బారిసిలోనాలో తీవ్ర ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో వేలాది మంది ప్రజలు ర్యాలీలు చేపట్టారు. "టూరిజంపై పరిమితులు పెడదాం" అనే నినాదంతో సుమారు 3,000 మంది నగర వాసులు... మిలియన్ల మందిగా వస్తోన్న పర్యాటకులను తగ్గించే కొత్త విధానాన్ని తీసుకురావాలని, అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా స్పందించిన సామాజిక శాస్త్రవేత్త జోర్డి గుయు... పర్యాటకానికి తాము వ్యక్తిరేకం కాదు.. ఇక్కడ జనం వ్యతిరేకులు కాదు కానీ... ఇక్కడ బార్సిలోనాలో స్థానిక ప్రజానికం, పర్యాటకం కారణంగా నివసించలేని పరిస్థితులు వస్తున్నాయనేదే తమ ఆవేదన అని వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే... "మా ప్రాంతం నుంచి పర్యాటకులు వెళ్లిపోండి" అనే నినాదాలు చేశారు. మరి ఈ డిమాండ్స్ పై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది వేచి చూడాలి.