వరుసగా మూడు షాక్ లు... బాబు ముందున్న ఆప్షన్స్?
ఇదే సమయంలో "తర్వాత ఏమి చేద్దాం"అనే విషయంపై బాబు తరుపు న్యాయవాదులు సమాలోచనలు చేస్తున్నారని అంటున్నారు.
స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అత్యంత కీలకంగా భావించిన క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ఇదే సమయలో జ్యూడీషియల్ రిమాండ్ మరో రెండు రోజులు పొడిగిస్తూ తీర్పు వెలువడింది. అనంతరం సీఐడీ వేసిన కస్టడీ పిటిషన్ కు ఏసీబీ కోర్టు అనుమతి ఇస్తూ... ఐదు రోజులకు బదులు రెండు రోజులు మంజూరు చేసింది. దీంతో శని, ఆదివారాలు సీఐడీ అధికారులు చంద్రబాబును విచారించనున్నారు.
ఇలా వరుసగా మూడు షాక్ లు శుక్రవారం స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబుకు తగిలిన పరిస్థితి. ఇందులో భాగంగా సీఐడీ కస్టడీ రెండు రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే జరగనుంది. ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ బాబును సీఐడీ అధికారులు న్యాయవాదుల సమక్షంలో విచారించనున్నారు.
ఇదే సమయలో విచారణ మొత్తాన్ని వీడియో, ఆడియో రికార్డింగ్ చేయబోతున్నారని తెలుస్తుంది. రెండు రోజుల విచారణ అనంతరం ఆదివారం సాయంత్రం వీడియో కాంఫరెన్స్ ద్వారా చంద్రబాబుని సీఐడీ అధికారులు న్యాయస్థానం ముందు హాజరుపరచాల్సి వస్తోంది. దీంతో ఆ రెండు రోజుల కస్టడీలో బాబును ఏ ప్రశ్నలు అడగబోతున్నారు.. బాబు ఏమని సమాధానం చెప్పాలనుకుంటున్నారనేది అత్యంత కీలకంగా మారబోతోందని తెలుస్తుంది.
ఈ పరిస్థితుల్లో చంద్రబాబు ముందున్న ఆప్షన్స్ ఏమిటి... నెక్స్ట్ ఆయన చేయబోయేది ఏమిటి అనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదే సమయంలో "తర్వాత ఏమి చేద్దాం"అనే విషయంపై బాబు తరుపు న్యాయవాదులు సమాలోచనలు చేస్తున్నారని అంటున్నారు. అయితే... ఈ కేసుపై చంద్రబాబు.. సుప్రీంకోర్టునూ ఆశ్రయించబోతున్నారని తెలుస్తుంది.
అవును... ఏపీ హైకోర్టు, ఏసీబీ కోర్టుల్లో వరుసగా ఇబ్బందులు ఎదురైన నేపథ్యంలో సుప్రీం కోర్టుకు వెళ్లాలని బాబు ఆలోచిస్తున్నారని అంటున్నారు. ఇందులో భాగంగా సోమవారం ఈ మేరకు బాబు లాయర్లు సుప్రీంకోర్టు తలుపు తట్టబోతున్నారని తెలుస్తుంది! లోకేష్ ఢిల్లీలోనే ఉండటంతో... ఇప్పటికే ఆ పనుల్లో బిజీగా ఉన్నారని అంటున్నారు.
అయితే మరోపక్క ఏపీ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని కొంతమంది టీడీపీ నేతలు చెబుతుంటే... ఇన్ని ఆధారాలుంటే సుప్రీంకోర్టులోనూ ఇదే పరిస్థితి ఎదురవ్వొచ్చేమో అనే సందేహాన్ని మరికొందరు వ్యక్తం చేస్తున్నారని తెలుస్తుంది. ఇదే సమయంలో పార్టీ నేతలతోనే కాకుండా... ముఖ్యంగా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులతో లోకేష్ మంతనాలు జరుపుతున్నారని తెలుస్తుంది.