ఫస్ట్ టైం లోకేష్ అధ్యక్షతన టీడీపీ కీలక భేటీ !
నారా లోకేష్ అధ్యక్షతన జరగనున్న సమావేశం చాల కీలక నిర్ణయాలను తీసుకుంటుంది అని అంటున్నారు. ప్రత్యేకించి నారా భువనేశ్వరి ఏపీలో జరిపే పర్యటనలపై సమావేశంలో చర్చ జరుగుతుంది అని అంటున్నారు.
తెలుగుదేశం పార్టీ దాదాపు ఒక మండలం తరువాత అంటే నలభై రోజుల తరువాత ఒక కీలక మీటింగ్ కి రెడీ అవుతోంది. చంద్రబాబు ఎపుడూ టీడీపీ ని లీడ్ చేసేవారు. ఆయన అధ్యక్షతలోనే పార్టీ సమావేశం అవుతూ వచ్చేది. ఇక లోకేష్ బాబు తరువాత అనుకున్నా ఆయనకు ఎపుడూ ఆ చాన్స్ రాలేదు. ఎందుకంటే చంద్రబాబు ఉండగా లోకేష్ అవసరం పడదు కాబట్టి.
పార్టీలో సీనియర్ నేతలు అంతా చంద్రబాబుకే విధేయులు. వారు బాబు మాటనే వింటారు. తమ రాజకీయం బాబుతోనే అనుకుని ఉన్న వారు. ఒక వేళ బాబు టీడీపీలో యాక్టివ్ పాలిటిక్స్ నుంచి తప్పుకుంటే తాము కూడా సైడ్ అయి తమ వారసులను పెట్టేసి హ్యాపీగా రెస్ట్ తీసుకుందామని ఆలోచనలోనే చాలా మంది నేతలు ఉన్నారు.
ఇక ఇపుడు అనుకోని సందర్భం వచ్చి పడింది. చంద్రబాబు యాక్టివ్ గానే ఉన్నారు. ఆయన నాయకత్వంలోనే టీడీపీ పనిచేస్తోంది. అయితే చందరంగంలో పావుని తీసి పక్కన పెట్టినట్లుగా గత నలభై రోజులుగా చంద్రబాబు అయితే టీడీపీ నుంచి వేరు చేయబడ్డారు. ఆయన రాజమండ్రి జైలులో ఉంటున్నారు. ఆయన లేని చోట ఆయన ఆబ్సెన్స్ లో పార్టీ ని నడిపించడం ఎలా అన్న తర్జన భర్జనలకు పుణ్యకాలం అంతా గడచిపోయింది.
పార్టీలో లోకేష్ ఉన్నా సీనియర్లను కూడా కలుపుకుని పోవాల్సి ఉంది. అందుకే యాక్షన్ కమిటీ అని పద్నాలుగు మందితో ఏర్పాటు చేశారు. అందులో లోకేష్ ని ఒక మెంబర్ గా ఉంచారు. అయితే ఈ కమిటీ అయితే కీలక నిర్ణయాలను అయితే పెద్దగా తీసుకోవడం లేదు. దాంతో తాజాగా చంద్రబాబుతో ములాఖత్ అయిన తరువాత బాబు ఏమి చెప్పారో కానీ టీడీపీని టోటల్ గా లోకేష్ లీడ్ చేసేందుకు రెడీ అవుతున్నారు.
అలా ఆయన ప్రెసిడెంట్ షిప్ లో టీడీపీ తొలిసారిగా మీట్ కాబోతోంది. అలా ఈ నెల 21న టీడీపీ విస్తృత స్థాయి సమావేశం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరగనుంది అని తెలుస్తోంది. నారా లోకేష్ అధ్యక్షతన జరగనున్న సమావేశం చాల కీలక నిర్ణయాలను తీసుకుంటుంది అని అంటున్నారు. ప్రత్యేకించి నారా భువనేశ్వరి ఏపీలో జరిపే పర్యటనలపై సమావేశంలో చర్చ జరుగుతుంది అని అంటున్నారు.
ఆమె ఎక్కడెక్కడికి వెళ్ళాలి. ఆమె టూర్ ని ఎలా ప్లాన్ చేయాలి. ఆమె టూర్ ని ఎలా సక్సెస్ చేయాలి అన్నది కూడా చర్చించబోతోంది. ఒక విధంగా పార్టీ మొత్తాన్ని అలెర్ట్ చేసే విధంగానే ఈ మీటింగ్ ఉంటుంది అని అంటున్నారు. ఇక పార్టీలో లోకేష్ హోదా ఏంటి అన్నది చూస్తే ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. బాబు జాతీయ ప్రెసిడెంట్. ఆయన లేని సమయంలో పార్టీకి లోకేష్ సహజంగానే తదుపరి నాయకుడు అవుతారు.
అలా పార్టీ ప్రోటోకాల్ కి ఎలాంటి ఇబ్బంది లేదు. పార్టీ జాతీయ నాయకత్వం లో జరిగే ఈ భేటీలో పొలిట్ బ్యూరో మెంబర్స్ అంతా పాల్గొంటారు. అలాగే సీనియర్ లీడర్స్ అంతా పాల్గొంటారు. అదే విధంగా పార్టీలో ఉన్న ముఖ్య నేతలు కూడా అటెండ్ అవుతారు. ఇక ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు సహా అంతా వస్తారని అంటున్నారు.
ఒక విధంగా టీడీపీ ఇపుడు లోకేష్ నాయకత్వం లో మొదటిసారిగా కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేయబోతోంది. బాబు అరెస్ట్ జైలు లోకేష్ నాయకత్వాన్ని అంతా ప్రత్యక్షంగా చూసేలా ఒక అవకాశం ఇచ్చింది అని కూడా అనుకోవాలి. అదే టైం లో చంద్రబాబు కూడా లోకేష్ కే నాయకత్వాన్ని అప్పగించాలని అనుకుంటున్నారు. కానీ అది ఇంత తొందరగా వస్తుందని ఆయన కూడా ఊహించి ఉండరు. మొత్తానికి చాలా రోజులుగా ఉన్న అయోమయానికి పార్టీలో సాగుతున్న కొంత ఊగిసలాటకు తెర పడే విధంగా లోకేష్ నాయకత్వం ఉంటుందని అంటున్నారు.
ఇక మీదట చంద్రబాబు ఎన్ని రోజులు జైలులో ఉన్నా లోకేష్ బాబు రోల్ లోకి వచ్చి పార్టీని ముందుకు నడిపిస్తారు అని అంటున్నారు. ఇక సీనియర్లు బాబు ఏజ్ గ్రూప్ వారు ఇతర నేతలు అంతా ఇపుడు యువ నేత లోకేష్ మార్గదర్శకత్వంలోనే నడవాల్సి ఉంటుంది అని అంటున్నారు. సో ఈ నెల 21న జరిగే మీటింగ్ అన్నది చాలా ముఖ్య భూమిక పోషించబోతోంది అని అంటున్నారు.