గెలుపుపై కసి మిస్.. మరీ ఇంత నస అయితే కష్టం లోకేశ్

తాజాగా ఉత్తరాంధ్రలో నిర్వహించిన పలు సభల్లో లోకేశ్ మాట్లాడిన మాటలు చూస్తే.. ఈ విషయం ఇట్టే అర్థమైపోతుంది.

Update: 2024-02-20 04:31 GMT

ఎప్పటికప్పుడు సరికొత్తగా ప్రత్యర్థులపై విరుచుకుపడే రాజకీయ నేతలు సక్సెస్ అవుతుంటారు. అంతే తప్పించి.. స్కూల్లో మాష్టారు పుస్తకాల్లోని పాఠాల్ని చెప్పే వైనం ఆసక్తిని రేకెత్తించే కన్నా.. నస పుట్టించేలా ఉండటం చూస్తుంటాం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ యువనేత చినబాబు అలియాస్ నారా లోకేశ్ మాటల్ని చూస్తే స్కూల్లో మాష్టారు చెప్పే పాఠాల మాదిరి ఉండటం కనిపిస్తుంది. ఓపక్క ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెలరగిపోతుంటే.. అందుకు భిన్నంగా లోకేశ్ పెద్దగా ఎఫెక్టు చూపినట్లుగా లేదంటున్నారు.

ఈ డోస్ తో ఎలాంటి ఎఫెక్టు ఉండదని తేల్చేస్తున్నారు. రాఫ్తాడు సభకు వచ్చిన లక్షలాది మంది ప్రజల మద్య మాట్లాడిన జగన్ మాటలు.. ప్రత్యర్థులపై విరుచుకుపడేలా.. వారిని కార్యన్మోఖుల్ని చేసేలావ్యాఖ్యలు ఉంటాయి.

లోకేశ్ మాటలు అంత ఎఫెక్టివ్ గా ఉండవంటున్నారు. తాజాగా ఆయన చేసిన పలు ప్రసంగాల సారాంశాన్ని చూస్తే.. ప్రత్యర్థిపై కసి మిస్ కావటమే కాదు.. ఆయన మాటలు నసను మాదిరి ఉన్నాయంటున్నారు.

తాజాగా ఉత్తరాంధ్రలో నిర్వహించిన పలు సభల్లో లోకేశ్ మాట్లాడిన మాటలు చూస్తే.. ఈ విషయం ఇట్టే అర్థమైపోతుంది.

- నవరత్నాల పేరు చెప్పి అధికారంలోకి వచ్చి.. తర్వాత జగన్‌ నవ మోసాలు చేశారు.

- జలయజ్ఞం చేస్తానని చెప్పి.. తట్టెడు మట్టి కూడా వేయలేదు.

- సంపూర్ణ మద్య నిషేధం చేసి మహిళలను ఓట్లు అడుగుతానని చెప్పిన పెద్ద మనిషి బూమ్‌బూమ్‌ దుకాణాలు పెట్టి ఎక్కడ చూసినా పుష్కలంగా మద్యం అమ్మడమే కాకుండా రోజుకు రూ.లక్ష వ్యాపారం చేయాలని సేల్స్‌మెన్‌కు లక్ష్యాలు నిర్దేశించారు.

- కల్తీ మద్యం తాగి లక్షలాది మంది చనిపోతున్నారు.

- రూ.1,000 దాటితే ఆరోగ్యశ్రీ అని చెప్పి.. ఇప్పుడు దానిని అనారోగ్యశ్రీ చేశారు. ఆస్పత్రులకు రూ.వెయ్యి కోట్లు బకాయి పెట్టారు. ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చేశారు.

- 45 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు ఏడాదికి రూ.18 వేలు ఇస్తామని నమ్మించి వంచించారు.

- పేదలకు 30 లక్షలు ఇళ్లు ఇస్తామని చెప్పి 3 వేలు కూడా కట్టలేని అసమర్థ సీఎం.

- టీడీపీ హయాంలో వెయ్యి రూపాయలు ఉండే టన్ను ఇసుక ధర జగన్‌ పాలనలో రూ.5 వేలకు పెరిగిపోయింది. పెరిగిన రూ.4 వేలలో స్థానిక ఎమ్మెల్యే, మంత్రి నుంచి సీఎం వరకూ వాటాలు వెళ్తున్నాయి.

- వలంటీర్లను ఇంటింటికీ పంపించి ప్రజలు పీల్చే గాలికి కూడా పన్ను వసూలు చేయించే దుర్మార్గానికి సైతం వెనుకాడడు.

- ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా అమ్మ ఒడి అని చెప్పి.. గద్దెనెక్కాక ఒకరికే పరిమితం చేశారు.

- ఇలా ప్రతి దాంట్లో మోసం చేశారు.

- వైసీపీ నవమోసాలపై జగన్‌ చర్చకు వస్తారా? ఆయన వైనాట్‌ 175 అని అంటున్నారు. మరి ‘వైనాట్‌ విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిలుపుదల’, ‘వైనాట్‌ పోలవరం ప్రాజెక్టు పూర్తి’, వైనాట్‌ జాబ్‌ కేలెండర్‌.. వైనాట్‌ గ్రూపు-1,2 నోటిఫికేషన్‌.... వైనాట్‌ సంపూర్ణ మద్య నిషేధం? అని ఎందుకు అనడం లేదన్న లోకేశ్ మాటలు రోటీన్ తరహాలో ఉన్నాయనే తప్పంచి.. కొత్తదనం ఏమీ లేదన్నది తెలుగు తమ్ముళ్లు మాటగా చెబుతున్నారు.

Tags:    

Similar News