లోక్ సభకు డిసెంబర్ లో ముందస్తు ఎన్నికలు....?
ఇవన్నీ చూస్తూంటే మమతా బెనర్జీ వంటి వారు చెబుతున్నది వాస్తవం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.
లోక్ సభకు ముందస్తు ఎన్నికలు జరగబోతున్నాయా అంటే చాలా కాలంగా ఈ విషయం ప్రచారంలో ఉంది కాబట్టి జరిగితే జరగవచ్చు అనే వాళ్లే ఎక్కువగా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి బీజేపీ నుంచి అయితే ఎలాంటి సమాచారం అయితే బయటకు పొక్కడం లేదు. మరో వైపు విపక్షాలు మాత్రం అనుమానిస్తాయి.
ముందస్తు ఎన్నికల హడావుడిని పసిగట్టినది బెంగాల్ టైగర్ మమతా బెనర్జీ. ఆమె దేశంలో ముందస్తు ఎన్నికలు కచ్చితంగా జరుగుతాయని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంట్ డౌట్లూ పెట్టుకోవాల్సిన అవసరం లేదు బీజేపీ ఆ దిశగా అడుగులు చకచకా వేస్తోంది అని ఆమె అంటున్నారు. దేశంలో ఎన్నికల ప్రచారం కోసం బీజేపీ ప్రత్యేక హెలికాప్టర్లను సిద్ధం చేసి ఉంచిందని కూడా ఆమె కొత్త విషయం చెబుతున్నారు.
ఎపుడు ఎన్నికలు వచ్చినా విపక్ష కూటమి కచ్చితంగా ఎదుర్కొంటుందని, ఈసారి కేంద్రంలో అధికారం మారడం తధ్యమని కూడా ఆమె చెబుతున్నారు. ఇదిలా ఉంటే ముందస్తు ఎన్నికలు ఎందుకు వస్తాయి మమతా బెనర్జీ ప్రకటనలకు ఎంతవరకూ బలం ఉంది అన్నది కనుక చూస్తే సహేతుకమైన కారణాలు కనిపిస్తున్నాయి.
దేశంలో అయిదు రాష్ట్రాలకు ఎన్నికలు ఈ ఏడాది డిసెంబర్లోనే ఉన్నాయి. ఇవి లోక్ సభ ఎన్నికలకు సెమీ ఫైనల్స్ గా అంతా భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో కనుక బీజేపీకి దెబ్బ పడితే ఆ ప్రభావం కచ్చితంగా 2024లో జరగబోయే లోక్ సభ ఎన్నికల మీద కచ్చితంగా ఉంటుంది. దాంతో పాటు విపక్ష కూటమికి గెలుపు ధైర్యం వచ్చేస్తుంది.
అందువల్ల వారికి ఆ చాన్స్ ఇవ్వకూడదు అంటే జనం మూడ్ ని తెలియకుండానే లోక్ సభకు కూడా ముందుగా ఎన్నికలకు వెళ్తేనే బెటర్ అన్నది బీజేపీ ఆలోచన అని అంటున్నారు. దేశంలో పలు జాతీయ సర్వేలు సైతం బీజేపీకి ఇప్పటికిపుడు ఎన్నికలు పెడితేనే గెలుపు అవకాశాలు ఉంటాయని చెబుతున్నాయి.
ఇంకో వైపు విపక్ష కూటమి ఇంకా సర్దుకోలేదు, ప్రధాని అభ్యర్థి మీద క్లారిటీ లేదు. వారిలో వారికి కో ఆర్డినేషన్ కుదరాల్సి ఉంది. అన్నింటికీ మించి బీజేపీ బలం ఎంతో ఇంకా విపక్ష కూటమికి తెలిసిరావడం లేదు. అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కనుక జరిగితే తమ బలం ఎంత బీజేపీ బలం ఎంత అన్న దాని మీద పక్కా క్లారిటీ వచ్చేస్తుంది. అపుడు విపక్ష కూటమి పులి మాదిరిగా దూకుడు చేయడం ఖాయం.
అందుకే విపక్ష కూటమి అలాంటి చాన్స్ కలలో కూడా ఇవ్వకూడదని బీజేపీ అధినాయకత్వం అనుకుంటోంది. అందుకే ముందస్తు ఎన్నికల వ్యూహానికి పదును పెడుతోంది అని అంటున్నారు. అంటే అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటే లోక్ సభకు కూడా ఎన్నికలు అన్న మాట. అదే జరితే జాతీయ అంశాలే ఎన్నికల్లో ప్రభావితం అవుతాయి మోడీ ఇమేజ్ తో అసెంబ్లీ సీట్లను గెలుచుకోవచ్చు. అలాగే మూడవ సారి కేంద్రంలో అధికారంలోకి కూడా రావచ్చు.
ఇదీ బీజేపీ ప్లాన్ గా ఉంది అని అంటున్నారు. అందువల్ల డిసెంబర్ లో కానీ జనవరిలో కానీ లోక్ సభకు ముందస్తు ఎన్నికలు ఉంటాయని భావిస్తున్నారు. దాని కంటే ముందు అక్టోబర్ నవంబర్ లో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నిర్వహిస్తారని, కీలకమైన బిల్లులకు అందులో ఆమోదం తీసుకుంటారు అని అంటున్నారు.
ఇవన్నీ చూస్తూంటే మమతా బెనర్జీ వంటి వారు చెబుతున్నది వాస్తవం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. మరి ముందస్తు గా లోక్ సభకు ఎన్నికలు అంటే ఏపీలో కూడా అసెంబ్లీకి ఎన్నికలు ఉంటాయా అన్నది మరో కీలకమిన ప్రశ్నగా ఉంది. ఏది ఏమైన రానున్న మూడు నాలుగు నేలలలో ఎన్నికల హడావుడి మొదలవబోతోంది అని అంటున్నారు.