వాలెంటైన్స్ స్పెషల్: ఈ ఏడాది ఈ రాశుల వారికే ప్యార్ ప్రాప్తిరస్తు
ఈ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా కొత్త థియరీ ఒకటి తెర మీదకు వచ్చింది. అదేమంటే..
ఒక్కొక్కళ్లది ఒక్కో థియరీ. ఎంత టెక్నాలజీలోకి దూసుకెళ్లిపోయి.. ఏఐ కాలంలోకి వెళ్లినా.. ఇప్పటికి చెక్కుచెదరని పాత విషయాలు కొన్ని ఉంటాయి. వాటిపై ఎంతటి భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికి.. ఆ నమ్మకాలను మిస్ కాకుండా.. వాటికి ప్రయారిటీ ఇచ్చి మరీ ఫాలో అవుతుంటారు పలువురు. మూఢ నమ్మకాలని కొట్టిపారేసే వారు సైతం.. ఫర్లేదు దాని గురించి తెలుసుకుంటే తప్పేంటి? అంటూ ప్రశ్నించటం కనిపిస్తుంది.
రాశులు.. జాతక చక్రాలను నమ్మే వారు.. నమ్మని వారు సైతం వాటి పట్ల ఆసక్తి చూపుతుంటారు. పేరు ఆధారంగా కొందరు.. పుట్టిన తేదీకి తగ్గట్లుగా ఇంకొందరు తాము ఏ రాశికి చెందిన వారిమన్న విషయంపై ఫోకస్ చేస్తుంటారు. ఈ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా కొత్త థియరీ ఒకటి తెర మీదకు వచ్చింది. అదేమంటే.. జ్యోతిష్య శాస్త్రంలో ఉండే మొత్తం పన్నెండు రాశుల్లో కొన్నిరాశుల వారికే ఈ ఏడాది ప్యార్ ప్రాప్తం ఉంటుందని సెలవిస్తున్నారు. ఇదంతా కేవలం నమ్మకానికి సంబంధించిన విషయమన్నది మర్చిపోకూడదు.
మొత్తం పన్నెండు రాశుల్లో కేవలం ఐదు రాశుల వారికే ఈ ఏడాది ప్రేమ ప్రాప్తిస్తుందని.. మిగిలిన వారు కాస్త వెయిట్ చేయక తప్పదంటున్నారు. ఇంతకూ ఆ ఐదు రాశులు వారేంటి? వారి ప్రేమల విషయంలో ఎలాంటి అంచనాల్ని పండితులు చెబుతున్నారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..
మేషరాశి
శుల్లో మొదటి రాశిగా సుపరిచితమైన మేషరాశి వారికి ఈ ఏడాది ప్రేమలో తిరుగు ఉండదని చెబుతున్నారు. ఈ రాశి వారు ఎదుటి వారి మనసుల్ని ఇట్టే బుట్టలో పడేసే టాలెంట్ ఉంటుందని సెలవిస్తున్నారు. ఈ ఏడాది వారికి దివ్యంగా ఉంటుందని.. కాబట్టి వారు నచ్చిన వారికి ధైర్యంగా ఈ ఏడాది తమ ప్రేమను ప్రకటించొచ్చని చెబుతున్నారు. ఇక ఆలస్యమెందుకు?
మిథునరాశి
ఈ రాశి వారికి ఈ ఏడాది ‘ప్రేమ’ కలిసి వస్తుందట. తమకు నచ్చిన వారిని వీరు అలవోకగా ఆకర్షించటమే కాదు.. తమ ప్రేమలో భాగస్వాములు అయ్యేలా చేసుకోవటంలో ఈ ఏడాది వారికి కలిసి వస్తుందని చెబుతున్నారు. దూకుడుగా దూసుకెళ్లినా ఫర్లేదంటూనే.. అతి దూకుడు మాత్రం వద్దంటూ సలహా ఇస్తున్నారు.
సింహరాశి
ఈ ఏడాది ఈ రాశి వారి ప్రేమకు తిరుగు లేదంటున్నారు. వారేం చేసినా ప్రశంసలు.. కితాబులతో కాలం గడిచిపోతుందంటున్నారు. అంతేకాదు.. ఏ మాత్రం ఊహించకుండానే వీరు ప్రేమలో పడిపోతుంటారని చెబుతున్నారు. ఈ రాశి వారు ఎవరైనా సరే.. తమకు నచ్చినోళ్లను జీవిత భాగస్వాములుగా తీసుకోవటానికి.. వారిని తమ జీవితాల్లోకి వెల్ కం చెప్పటానికి ఈ ఏడాది ఉత్తమమని చెబుతున్నారు.
తుల రాశి
ఈ రాశి వారు బేసిక్ గానే మాంచి రొమాంటిక్ ఫెలోస్ గా చెబుతారు. తమ చుట్టు నలుగురు ఉంటే ముగ్గురి మనసు గెలుచుకునే రకమని వీరి గురించి చెబుతుంటారు. ప్రేమ ఇవ్వటానికి.. పొందటానికి వీరికి ఈ ఏడాది చాలా చక్కగా ఉంటుందని చెబుతున్నారు. ఇక.. ఆలస్యం చేయాల్సిన అవసరమే లేదట.
ధనస్సు రాశి
ఈ రాశి వారు డేరింగ్ అండ్ డాషింగ్ గా చెబుతుంటారు. ఈ రాశి వారు ఇప్పటికి ప్రేమలో పడకుంటే.. ఈ ఏడాది ప్రేమికుల దినోత్సవానికి లవ్ లో పడే ఛాన్సులు ఉంటాయని చెబుతున్నారు. ఇప్పటికే ప్రేమలో మునిగి తేలే వారికి ఊహించని మలుపులు ఉంటాయని చెబుతున్నారు. లవ్ జర్నీ బాగానే ఉన్నా..కాస్తంత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
ఈ ఐదు రాశుల వారికేనా? మిగిలిన వారి సంగతేమిటన్న ప్రశ్న రావొచ్చు. వారికి ప్రేమ ప్రాప్తం లేదని కాదు. ఈ ఏడాది అంత సానుకూలంగా ఉండదని మాత్రమే. అయితే మాత్రం ప్రయత్నాలు చేయొద్దా? అన్న ప్రశ్న అక్కర్లేదు. ప్రేమ అన్నది నిరంతర ప్రక్రియ.. దాన్ని కొనసాగిస్తూ ఉండొచ్చు. అందుకు ఎలాంటి నమ్మకాల్ని నమ్మాల్సిన అవసరం లేదు.