బెజవాడలో యువకుల లవ్‌ స్టోరీ... లింగమార్పిడి తర్వాత ట్విస్ట్!

అవును... విజయవాడకు చెందిన ఇద్దరు యువకులు బీఈడీ చదివారు. చదువుకునే రోజుల్లో ప్రేమించుకున్నారు.

Update: 2023-08-17 07:50 GMT

విజయవాడలో ఇద్దరు యువకుల మధ్య నడిచిన ప్రేమకథ, అనంతరం జరిగిన ట్విస్ట్ విషయాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఎన్నో ట్విస్టులు, మరెన్నో జలక్కులతో కూడిన ఈ ప్రేమకథ సంగతి ఏమిటి.. ఏలా మొదలైంది.. ఎలా వ్యవహారం తెరపైకి వచ్చింది అనేది ఇప్పుడు చూద్దాం!

వివరాళ్లోకి వెళ్తే... ఇద్దరు యువకులు కాలేజీలో చదువుకుంటూ ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరూ కలిసే కొంతకాలం జీవించారు. అనంతరం సమాజం ఏమనుకున్నా.. ఎవరు ఎలా అనుకున్నా... పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. దీనికోసం అవయువ మార్పిడికి కూడా ప్లాన్ చేశారు.

అవును... విజయవాడకు చెందిన ఇద్దరు యువకులు బీఈడీ చదివారు. చదువుకునే రోజుల్లో ప్రేమించుకున్నారు. ఇద్దరూ కలిసి ఒకే రూమ్‌ లో ఉండటంతో పెళ్లి కూడా చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. పెళ్లి సంగతి తర్వాత ముందు లింగమార్పిడి చేయించుకోమని ఒక యువకుడు మరో యువకుడికి సలహా ఇచ్చాడు.

అనంతరం ఢిల్లీ తీసుకెళ్లి లింగమార్పిడి ఆపరేషన్ చేయించి అతడిపేరును మహిళ పేరుగా మార్చాడు. అక్కడే మొదలైంది అసలు ట్విస్ట్. లింగమార్పిడి చేయించుకున్న వ్యక్తితో అతని బాయ్ ఫ్రెండ్ పెళ్లికి నిరాకరించాడు. ఆమెగా మారిన అతడికి దూరంగా ఉంటూ వచ్చాడు. ఆఖరికి పెళ్లీ లేదు ఏమీ లేదని తేల్చి చెప్పాడు.

దీంతో... మోసపోయినట్లు గుర్తించిన ఆమె... పోలీస్‌ స్టేషన్‌ కి వెళ్లి ప్రియుడిపై ఫిర్యాదు చేసింది. దీంతో వ్యవహరం వెలుగులోకి వచ్చింది. మరి ఈ విషయంపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు.. అసలు ఈ వ్యవహారంపై ఎలాంటి సెక్షన్స్ పెడతారు.. అనేది వేచి చూడాలి!

Tags:    

Similar News