చంద్రుడిపై కుప్ప‌కూలిన లూనా -25.. ర‌ష్యాకు బిగ్ షాక్!

చంద్ర‌యాన్ 3 ప్ర‌యోగం విజ‌య‌వంతం అవుతుంద‌ని భార‌త‌దేశం ధీమాగా ఉంది. మ‌రో మూడు రోజుల్లో రిజ‌ల్ట్ తేలాల్సి ఉంది.

Update: 2023-08-20 12:30 GMT

చంద్ర‌యాన్ 3 ప్ర‌యోగం విజ‌య‌వంతం అవుతుంద‌ని భార‌త‌దేశం ధీమాగా ఉంది. మ‌రో మూడు రోజుల్లో రిజ‌ల్ట్ తేలాల్సి ఉంది. అయితే ఇండియాతో పోటీప‌డుతూ అగ్ర‌రాజ్యం ర‌ష్యా చంద్రుడిపైకి పంపించిన లూనా -25 నౌక కుప్ప‌కూలిపోవ‌డం తీవ్రంగా నిరాశ‌ప‌రిచింది. రష్యాకు చెందిన లూనా-25 అంతరిక్ష నౌక అనియంత్రిత కక్ష్యలో తిరుగుతూ చంద్రుడిపై కూలిపోయిందని రష్యా అంతరిక్ష సంస్థ రోస్కోస్మోస్ ఆదివారం ప్ర‌క‌టించింది. లూనా-25 .. 47 సంవత్సరాలలో చంద‌మామ పైకి రష్యాకు మొదటి మిషన్.

లూనా-25ను ల్యాండింగ్‌కు ముందు కక్ష్యలోకి మార్చడంలో రోస్కోస్మోస్ సమస్యను ఎదుర్కొంద‌ని వెల్ల‌డించిన ఒక రోజు తర్వాత చంద్రుడిపై ఈ నౌక కుప్ప‌కూలిపోయింద‌ని వార్త వెలువ‌డింది. ``నిజానికి క్రాఫ్ట్‌ను గుర్తించడానికి దానితో క‌మ్యూనికేష‌న్ పెట్టుకోవడానికి ఆగస్టు 19 -20 తేదీల్లో తీసుకున్న చర్యలు విఫలమయ్యాయి. ఉపకరణం అనూహ్యమైన కక్ష్యలోకి వెళ్లి చంద్రుని ఉపరితలంపై ఢీకొన‌డంతో ఉనికిలో లేకుండా పోయింది`` అని రోస్కోస్మోస్ ఒక ప్రకటనలో తెలిపింది. మిషన్ కంట్రోల్ క్రాఫ్ట్‌ను శనివారం 11:10 GMTకి ప్రీ-ల్యాండింగ్ కక్ష్యలోకి తరలించడానికి ప్రయత్నించినందున ``అసాధారణ పరిస్థితి`` ఏర్పడిందని ఏజెన్సీ పేర్కొంది. ఆగస్టు 21న ప్లాన్ చేసిన టచ్‌డౌన్ మిష‌న్ అనూహ్యంగా ఫెయిలైంది. ``ఆపరేషన్ సమయంలో ఆటోమేటిక్ స్టేషన్‌లో అసాధారణ పరిస్థితి ఏర్పడింది. ఈ ప‌రిస్థితి వ‌ల్ల అనుకున్న విధంగా ప‌ని తీరును నిర్వహించడం సాధ్య‌ప‌డ‌లేదు శనివారం 11:57 GMTకి లూనా-25తో కమ్యూనికేషన్ తెగిపోయింది`` అని రోస్కోస్మోస్ తెలిపింది.

లూనా-25 ఒక సంవత్సరం పాటు చంద్రునిపై ఉండి, మట్టి నమూనాలను సేకరించి నీటి కోసం వెతుకుతుందని క‌థ‌నాలొచ్చాయి. భవిష్యత్ ప్రయోగాలకు రాకెట్ ఇంధనాన్ని తయారు చేయడానికి .. అక్కడ మ‌నిషి నివాసానికి సంభావ్యత ఏమేర‌కు ఉందో ప‌రిశీలించ‌డానికి .. పదార్ధం జీవ‌రాశుల ఉనికిని క‌నుగొనేందుకు ఈ ప‌రిశోధ‌న ఉప‌క‌రించాల్సి ఉంది. ల్యాండర్‌పై అమర్చిన కెమెరాలు చంద్రుడి ఉపరితలంపై ఫోటోల‌ను మాత్రం తీసుకున్నాయి. ఈ వైఫ‌ల్యానికి ఎలాంటి సాంకేతిక సమస్యలు ఎదుర‌య్యాయో ర‌ష్యా ఇంకా తెల‌ప‌లేదు. కానీ నౌక‌ క్రాష్‌కు కారణాలపై దర్యాప్తు ప్రారంభించనున్నట్లు అంతరిక్ష సంస్థ తెలిపింది.

1957లో స్పుత్నిక్ 1ని క‌క్ష‌లోకి ప్ర‌వేశ‌పెట్టి సోవియట్ యూనియ‌న్ విజ‌య‌ప‌తాకాన్ని ఎగుర‌వేసింది. వ్యోమగామి యూరీ గగారిన్ సాయంతో మొదటి ఉపగ్రహాన్ని చంద్రుని క‌క్ష‌లోకి ప్రయోగించ‌డంలో విజ‌యం సాధించింది ర‌ష్యా. కానీ లూనా 25 వైఫల్యం రష్యా అంతరిక్ష శక్తిగా ఎద‌గ‌డంలో విఫ‌ల‌మైంద‌ని రుజువు అయింది. నిజానికి మనిషి 1961లో అంతరిక్షంలోకి ప్రయాణించాడు. ఆ త‌ర్వాత సాంకేతికంగా ఎంతో అభివృద్ధి సాధ్య‌మైంది. లియోనిడ్ బ్రెజ్నెవ్ క్రెమ్లిన్ పాల‌న‌లో 1976లో లూనా-24 తో చంద్రుని మిషన్‌ను ర‌ష్యా ప్రయత్నించలేదు. లూనా-25 ఆగస్టు 21న చంద్రుని దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్‌ను అమలు చేయాల్సి ఉంది. కానీ ఇది విఫ‌ల‌మైంది. చంద్రయాన్-3 ఆగస్టు 23న సాయంత్రం 6.04 గంటలకు ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తుంది.

Tags:    

Similar News