జగన్ షాకింగ్ ఐడియా: విశాఖ స్టీల్ ప్లాంట్ తీసేసి.. రాజధాని కడదాం!
``విశాఖ ఉక్కుతో ప్రయోజనం లేదు. పైగా పొల్యూషన్ కూడా ఉంది. దానిని నేలమట్టం చేసేద్దాం. అక్కడ 33 వేల ఎకరాల స్థలం ఎలానూ ఉంది.
వివాదాస్పద నిర్ణయాలకు, ప్రజావ్యతిరేక నిర్ణయాలకు కేంద్రంగా మారిన గత ముఖ్యమంత్రి జగన్.. రాజ ధాని విషయంలో ఏం చేశారో అందరికీ తెలిసిందే. నవ్యాంధ్ర రాజధాని కోసం.. మూడు పంటలు పండే 33 వేల ఎకరాల భూములను త్యాగం చేసిన అమరావతి రైతులను పక్కన పెట్టి మూడు రాజధానుల ప్రతిపా దన తీసుకువచ్చారు. దీనికంటే ముందు.. జగన్ చేసిన మరో వివాదాస్పద నిర్ణయం.. అతి తెలివి.. తాజా గా వెలుగు చూసింది. ఆంధ్రుల హక్కుగా అనేక సంవత్సరాల పాటు పోరాడి ఏర్పాటు చేసుకున్న విశాఖ ఉక్కును సైతం ఆయన కాలరాసే చర్యలకు ప్రయత్నించారు.
తాజాగా ఓ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న జగన్ హయాంలో తొలి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం .. అప్పట్లో జగన్ ఆలోచనా విధానాన్ని వెల్లడించి.. అందరినీ దిగ్భ్రంతికి గురి చేశారు. విశాఖను రాజధాని చేయాలన్న ఆలోచన జగన్‌కు తొలినాళ్లలోనే వచ్చిందని ఆయన తెలిపారు. ఈ క్రమంలో కొత్త ప్రాంతాన్ని ఎంపిక చేయాల్సిన ప్రభుత్వ పెద్దగా.. సుదీర్ఘ కాలం పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని నేల మట్టం చేసి.. అక్కడ రాజధానిని ఏర్పాటు చేయాలని భావించినట్టు ఎల్వీ తెలిపారు.
``విశాఖ ఉక్కుతో ప్రయోజనం లేదు. పైగా పొల్యూషన్ కూడా ఉంది. దానిని నేలమట్టం చేసేద్దాం. అక్కడ 33 వేల ఎకరాల స్థలం ఎలానూ ఉంది. అక్కడే రాజధాని కట్టేద్దాం`` అంటూ.. అప్పట్లో జగన్ తనకు చెప్పారని ఎల్వీ సుబ్రహ్మణ్యం తెలిపారు. అయితే.. జగన్ ఆలోచనా సరళి చూసి తాను దిగ్బ్రాంతికి గురైనట్టు వెల్లడించారు. అలా ఎలా చేస్తాం.. సర్.. అది సుదీర్ఘ కాలం పోరాడి ఏపీ ప్రజలు సాధించుకున్నారని తాను వివరించినా.. అప్పట్లో జగన్ వినిపించుకోలేదన్నారు. అంతేకాదు.. ``ఏంటి ఇలా వాదిస్తావ్`` అంటూ.. తనను తీవ్రంగావ్యాఖ్యానించినట్టు ఎల్వీ చెప్పారు.
ఇది జగన్‌కు వచ్చిన చాలా భయంకరమైన ఆలోచనగా ఎల్వీ పేర్కొన్నారు. దీనిని వినగానే తాను షాక్‌కు గురయ్యానన్నారు. ఇలాంటి ఆలోచనలు కూడా వస్తాయా? అని అనుకున్నట్టు తెలిపారు. అసలు ఏమిటీ ఆలోచన? ఎవరైనా అసలు ఇలా ఊహించగలరా? అని అనుకున్నట్టు చెప్పారు. తాను వద్దని వాదించిన ట్టు ఎల్వీ తెలిపారు. అయితే.. తన వాదనను జగన్ కొట్టిపారేశారని అన్నారు. ``ఏంటి నువ్విలా మాట్లాడ తావు. నీతో వచ్చిన సమస్యే ఇది`` అంటూ.. వ్యాఖ్యానించారని ఎల్వీ తెలిపారు. స్టీల్ ప్లాంట్‌తో పొల్యూషన్ లేదన్నా వినలేదని, సిటీ మధ్యలో స్టీల్ ప్లాంట్ ఉందని.. దానిని తీసేయాలని చెప్పారన్నారు.
కేంద్రంతో అలా చేయించారా?
ఇక, విశాఖ స్టీల్ ప్లాంటు విషయంలో కేంద్రం అనుసరిస్తున్న ధోరణి ఇప్పుడు మరోసారి చర్చనీయాం శంగా మారింది. అప్పట్లో జగన్‌తోచెట్టాపట్టాలేసుకుని తిరిగిన కేంద్రం.. విశాఖను ప్రైవేటీకరిస్తున్నామని చెప్పింది. అయితే.. ఈ ఆలోచన వెనుక జగన్ ఉండి ఉంటారని.. తాజాగా ఎల్వీ చేసిన వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది. అంతేకాదు.. కేంద్రం పట్టుదలగా ముందుకు కూడా సాగింది. ఈ నేపథ్యంలో కేంద్రాన్ని ఆ కోణంలో ముందుకు తీసుకువచ్చి.. విశాఖ ఉక్కును తీసేయించి.. ఇక్కడ రాజధానిని ఏర్పాటు చేయాలన్న ప్లాన్‌ను జగన్ అమలు చేయాలని అనుకున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా.. జగన్ ఆలోచనా విధానం ఇలా ఉంటుందని బహుశ.. ఎవరూ ఊహించి ఉండరేమో!! అంటున్నారు మేధావులు.