మహేందర్ మృతిపై రాజకీయం చేయెుద్దు... సంచలన వీడియో!
ఈ సమయంలో... మహేందర్ మృతిపై రాజకీయం చేయెుద్దు అంటూ కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు.
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం దొమ్మేరు గ్రామంలో దళిత యువకుడు మహేందర్ ఆత్మహత్య కేసు సంగతి తెలిసిందే. ఈ సమయంలో... మహేందర్ మృతిపై రాజకీయం చేయెుద్దు అంటూ కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఒక వీడియోను విడుదల చేశారు.
అవును... దొమ్మేరు గ్రామంలో దళిత యువకుడు మహేందర్ ఆత్మహత్య విషయాన్ని రాజకీయం చేయొద్దంటూ కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఈ వీడియోలో మాట్లాడిన మహిళ... మహేందర్ మృతి బాధాకరమని అన్నారు. ఇలాంటి విషాద సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తమకు ఎంతో అండగా నిలిచారని అన్నారు. వైసీపీ ప్రభుత్వం దళిత పక్షపాత ప్రభుత్వం అని నిరూపించారని అన్నారు.
మహేందర్ ఆత్మహత్య గురించి తెలుసుకున్న సీఎం వైఎస్ జగన్.. మంత్రులను, పార్టీ నాయకులను తమ ఇంటికి పంపించారని ఆమె తెలిపారు. అంతేకాకుండా... రూ.20 లక్షలు ఎక్స్ గ్రేషియా సైతం అందజేశారని వెల్లడించారు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వడంతోపాటు.. ఇల్లు కట్టిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారని ఆమె తెలియజేశారు.
ఇదే సమయంలో... మహేందర్ మృతికి కారణమైన నేరస్థులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం జగన్ హామీ ఇచ్చారని వెల్లడించారు. ఈ సందర్భంగా... ఈ విషాద సమయంలో తమకు ఎంతో అండగా నిలిచిన సీఎం జగన్, మంత్రులు, నాయకులు, గ్రామ యువతకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా... మహేందర్ మృతిని ఎవరు రాజకీయం చేయవద్దు అని ఆమె కోరారు.
కాగా... దొమ్మేరు గ్రామంలో దళిత యువకుడు మహేందర్ ఆత్మహత్య అనంతరం ఈ విషయాన్ని రాజకీయం చేయాలనుకుని పలువురు తీవ్ర ప్రయత్నాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో... మహేందర్ కుటుంబ సభ్యులు తాజాగా విడుదల చేసిన ఈ వీడియోతో వారందరికీ గట్టి షాక్ తగిలినట్లే అని అంటున్నారు పరిశీలకులు.