మల్లారెడ్డి సంచలన ప్రకటన

డీజే టిల్లుతో కలిసి సరదాగా స్టెప్పులు వేసినా...రేవంత్ రెడ్డి రా చూసుకుందాం అంటూ రాజకీయ ప్రత్యర్థులకు సవాల్ విసిరినా మల్లారెడ్డికే చెల్లింది.

Update: 2023-11-16 17:39 GMT

తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లోనూ మంత్రి మల్లారెడ్డి పేరు తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. పాలమ్మినా...పూలమ్మిన...కష్టపడ్డా...లైఫ్ లో సక్సెస్ అయిన...అంటూ కొద్ది నెలల క్రితం మల్లారెడ్డి చెప్పిన డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అప్పటి నుంచి మల్లారెడ్డి డైలాగ్ మీద ఎన్నో రీల్స్, షార్ట్స్, మీమ్స్ పేలుతూనే ఉన్నాయి. డీజే టిల్లుతో కలిసి సరదాగా స్టెప్పులు వేసినా...రేవంత్ రెడ్డి రా చూసుకుందాం అంటూ రాజకీయ ప్రత్యర్థులకు సవాల్ విసిరినా మల్లారెడ్డికే చెల్లింది. స్టార్ పొలిటిషన్ గానే కాదు దాదాపు సినీ సెలబ్రిటీకి ఉన్న ఇమేజ్, ఫాలోయింగ్ మల్లారెడ్డి సొంతం.

ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణ ఎన్నికలకు సిద్ధమవుతున్న మల్లారెడ్డి హఠాత్తుగా సంచలన ప్రకటన చేశారు. ఇవే తనకు చివరి ఎన్నికలని, రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోనని మల్లారెడ్డి చేసిన ప్రకటన తెలంగాణ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. ఓ మీడియా ఛానల్ తో మాట్లాడిన మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకి కొడుకులు, కోడలు, మనవాళ్లు, మనవరాళ్లు ఉన్నారని, రాజకీయ వారసులు ఎవరూ లేరని మల్లారెడ్డి అన్నారు. ఇప్పటికే చాలా ఆస్తులున్నాయని, కావలసినంత బ్యాంకు బ్యాలెన్స్ ఉందని చెప్పుకొచ్చారు.

ఇకపై తాను సాధించాల్సింది ఏమీ లేదని, తనకు 800 ఎకరాల భూమి ఉందని మల్లారెడ్డి షాకింగ్ ప్రకటన చేశారు. అయితే, తనపై వస్తున్న భూకబ్జా ఆరోపణలను మల్లారెడ్డి ఖండించారు. తాను ఒక గుంట భూమి కూడా కబ్జా చేయలేదని, తన భూములకు పక్కా డాక్యుమెంట్లు ఉన్నాయని మల్లా రెడ్డి చెప్పారు. ఈ ఎన్నికల్లో మల్లారెడ్డి మేడ్చల్ నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.

Tags:    

Similar News