బ్రేకింగ్: కుంభమేళాలో 30 మంది మృతి... షాకింగ్ విషయాలు చెప్పిన డీఐజీ!
ఇందులో భాగంగా... మౌని అమావాస్య కారణంగా నెలకొన్న రద్దీతో తొక్కిసలాట ఘటన చోటుచేసుకొని పదుల సంఖ్యలో భక్తులు మృతి చెందగా.. అనేక మంది గాయపడ్డారు.
ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఇందులో భాగంగా... మౌని అమావాస్య కారణంగా నెలకొన్న రద్దీతో తొక్కిసలాట ఘటన చోటుచేసుకొని పదుల సంఖ్యలో భక్తులు మృతి చెందగా.. అనేక మంది గాయపడ్డారు. తాజాగా ఈ వివరాలను మహా కుంభమేళా డీఐజీ వైభవ్ కృష్ణ వెల్లడించారు.
అవును... మహా కుంభమేళాలో బుధవారం తెల్లవారుజామున తొక్కిసలాట జరగ్గా.. ఈ ఘటనలో 30 మంది మృతిచెందారని.. 60 మంది గాయపడ్డారని డీఐజీ వెల్లడించారు. మౌని అమావాస్య రోజున పవిత్ర స్నానం కోసం వస్తోన్న మంది భక్తులు రాత్రి 1 - 2 గంటల మధ్య కొంతమంది బారికేడ్లపై నుంచి దూకడంతో సమయంలో ఈ ఘటన జరిగిందని తెలిపారు.
ఈ తొక్కిసలాటలో 30 మంది భక్తులు ప్రాణాలుకోల్పోగా.. వారిలో 25 మందిని గుర్తించామని, మిగిలిన ఐదుగురిని గుర్తించాల్సి ఉందని వైభవ్ కృష్ణ వెల్లడించారు. మరోపక్క ఈ ఘటనపై ప్రధాని నరేంద్రమోడీ స్పందించారు. ఇది అత్యంత బాధాకరమైన సంఘటన అని అన్నారు. తమ ఆత్మీయులను కోల్పోయిన భక్తులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
అదేవిధంగా... ఈ ప్రమాదంలో గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. బాధితులకు సాధ్యమైనంత మేర అన్ని విధాలా సాయం చేయడానికి స్థానిక యంత్రాంగం నిమగ్నమై ఉందని ట్వీట్ చేశారు. ఢిల్లీలో జరిగిన ర్యాలీలోనూ మోడీ ఈ విషయాన్ని ప్రస్థావించారు.. యూపీ రాష్ట్ర ప్రభుత్వంతో రెగ్యులర్ గా టచ్ లో ఉన్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా స్పందించిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్... కొంతమంది భక్తులు బారికేడ్లపై నుంచి దూకారని, వారిలో కొంతమంది గాయపడ్డారని.. ఆ సమయంలో తొక్కిసలాట జరిగిందని అన్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని.. ఈ ఘటన తర్వాత ప్రధాని తనతో నాలుగుసార్లు మాట్లాడారని.. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.
ఈ సమయంలో... కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర ఆరోగ్య శాఖామంత్రి జేపీ నడ్డా కూడా తనతో మాట్లాడి, కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సాయం అందిస్తామని హామీ ఇచ్చారని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి వెల్లడించారు.