ఎగ్జిట్ పోల్ : ఒక తాజా వంటకం !

‘ఎగ్జిట్ పోల్స్’ రెండు నెలల కిందట ఒక ఇంట్లో వండి తాజాగా వడ్డించిన వంటకం అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఎద్దేవా చేశారు.

Update: 2024-06-03 09:42 GMT

‘ఎగ్జిట్ పోల్స్’ రెండు నెలల కిందట ఒక ఇంట్లో వండి తాజాగా వడ్డించిన వంటకం అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఎద్దేవా చేశారు. అసలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు విలువ లేదని ఆమె కొట్టిపారేశారు.

గత ఎన్నికల సందర్భంగా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజం కాలేదని, ప్రస్తుతం లోక్ సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీల హవానే కొనసాగిందని, ఫలితాల్లో ఇది బయటపడుతుందని దీదీ అభిప్రాయపడ్డారు.

బెంగాల్ లో బీజేపీ హవా కొనసాగిందని, రాష్ట్రంలో మెజారిటీ సీట్లను కాషాయ పార్టీ కైవసం చేసుకుంటుందని దాదాపుగా అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు, ఈసారి తృణమూల్ కాంగ్రెస్ పార్టీని వెనకకు నెట్టి బీజేపీ ముందంజలో ఉంటుందన్న దానిపై ఏమనుకుంటున్నారన్న దానిపై మమతా బెనర్జీ స్పందించారు.

క్షేత్రస్థాయి పరిస్థితులకు, ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భారీ వ్యత్యాసం ఉంటుందని, 2016, 2019, 2021 లలో జరిగిన ఎన్నికల ఫలితాల్లో ఇదే విషయం స్పష్టమైందని దీదీ తెలిపారు. ఈసారి కూడా బెంగాల్ లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులవుతాయని అన్నారు. బెంగాల్ లో టీఎంసీకి వ్యతిరేకంగా, బీజేపీకి మేలు చేకూర్చేందుకు సీపీఎం, కాంగ్రెస్ పార్టీలు పనిచేశాయని దీదీ ఆరోపించారు.

Tags:    

Similar News