17,000 అడుగుల ఎత్తులో కైలాసానికి డైరెక్ట్ రోడ్డు!
సాధారణంగా టిబెట్ లోని హిమాలయాలలో నెలకొని ఉన్న పుణ్యక్షేత్రమైన కైలాష్ మానసరోవర్ ను చేరుకోవడానికి భక్తులు పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావనేది తెలిసిన విషయమే.
సాధారణంగా టిబెట్ లోని హిమాలయాలలో నెలకొని ఉన్న పుణ్యక్షేత్రమైన కైలాష్ మానసరోవర్ ను చేరుకోవడానికి భక్తులు పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావనేది తెలిసిన విషయమే. ఈ సందర్భంగా కైలాస పర్వతాన్ని దర్శించుకోవాలని ప్లాన్ చేస్తున్న భక్తులకు కచ్చితంగా ఇది గుడ్ న్యూసే!
కైలాసపర్వతాన్ని సందర్శించాలని భక్తులు సుమారు ఐదురోజుల పాటు ట్రెక్కింగ్ చేసి, ఎన్నో సాహసాలు చేసి, మరెన్నో కష్టాలను, వాతావరణ పరిస్థితులను ఓర్చుకుని ఈ ప్రయాణం చేస్తుంటారు. అయితే ఈ ఏడాది చివరి తర్వాత ఇకపై ఆ కష్టాలు ఉండవని తెలుస్తుంది. ఈ మేరకు కేంద్రప్రభుత్వం మొదలుపెట్టిన రహదారి పూర్తవ్వబోతోందని అంటున్నారు.
అవును... ఉత్తరాఖండ్ రాష్ట్రం నుండి డైరెక్టుగా కైలాస పర్వతానికి కేంద్రప్రభుత్వం రోడ్డును నిర్మిస్తోంది. ఆ రోడ్డు నిర్మాణం త్వరలో పూర్తవబోతోందని తెలుస్తుంది. అన్నీ అనుకూలంగా జరిగితే ఈ ఏడాది చివరినాటికి ఈ రహదారి అందుబాటులోకి రావొచ్చని తెలుస్తుంది.
కైలాసపర్వతంపైన పరమశివుడు కొలువయ్యుంటారని కోట్లాదిమంది భక్తులు నమ్ముతున్నారు. మానససరోవరం కూడా భారత్ - చైనా సరిహద్దుల్లో ఉన్న కైలాస పర్వతంలోనే ఉంది. టెక్నికల్ గా ఈ కైలాసపర్వతంలో కొంత భూభాగం చైనా పరిధిలోకి వస్తుంది.
దీంతో కైలాస పర్వతాన్ని సందర్శించుకోవాలనుకునే భక్తులకు చైనా ప్రభుత్వం అనుమతి కూడా అవసరమవుతోంది. అందుబాటులో ఉన్న ట్రెక్కింగ్ రహదారి వెంట వెళ్లలేనివారు... పూర్తిగా చైనా, నేపాల్ నుంచి వెళ్లాల్సి వస్తోంది. ఈ సమయంలో భక్తుల ఇబ్బందులను అర్ధం చేసుకున్న ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది.
ఇందులో భాగంగా ఉత్తరాఖండ్ లోని పితోర్ ఘర్ నుంచి నేరుగా కైలాస మానసరోవర్ కు రహదారిని నిర్మిస్తోంది. ఈ పితోర్ ఘర్ ఢిల్లీ నుండి 490 కి.మీ దూరంలో ఉంది. ఈ కొత్త మార్గం నేపాల్, చైనాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. ఈ ప్రాజెక్టు పనులు ఇప్పటికే 85 శాతం పూర్తయ్యాయని తెలుస్తుంది.
ఈ రహదారి పూర్తయిపోతే కైలాష్ మానసరోవర్ ను చేరుకోవడానికి కారులో కేవలం ఒక రోజు పడుతుందని అంటున్నారు. ఈ ప్రాజెక్టు కోసం సుమారు రూ.440 కోట్లు కేంద్రం కేటాయించగా... పనులు 2018లో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బి.ఆర్.ఓ.) ద్వారా ప్రారంభించబడ్డాయి!
లాష్ మానసరోవర్ టిబెట్ లోపల లిపు లేఖ్ సరిహద్దు నుండి కేవలం 16 కి.మీ. దూరంలో ఉంది. ఈ లిపు లేఖ్... భారతదేశం, నేపాల్, చైనాల ట్రై జంక్షన్ సరిహద్దులో 17,000 అడుగుల ఎత్తులో ఉంది. ఈ లిపులేఖ్ పాస్ నుండి 100 కిలోమీటర్లు ప్రయాణిస్తే కైలాసపర్వతం వస్తుంది.
దీంతో కేంద్రం చేపట్టిన ఈ రోడ్డులో చివరి 5 కి.మీ విభాగం కుడి వైపున పెద్ద నది మరియు ఎడమ వైపు నిటారుగా ఉన్న కొండలు ఉన్నాయని అంటున్నారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తియపోతే వెంటనే భక్తులను అనుమతించాలని కేంద్రం సిద్ధంగా ఉంది. ఈ మార్గం పూర్తయితే కైలాస యాత్రతోపాటు ఎట్టకేలకు సరిహద్దు గ్రామాలకు మాత్రం తొలిసారిగా రహదారులు అనుసంధానం అయ్యే అవకాశం ఉంది!