ఎక్కడుందీ జల్ పల్లి..? మోహన్ బాబుది రాజప్రాసదమా..?

జల్ పల్లి.. జల్ పల్లి.. జల్ పల్లి.. మూడు, నాలుగు రోజుల నుంచి మీడియాలో ఒకటే హడావుడి.. కారణం.. సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబంలో విభేదాలు. ఈ ఇంటిలో వాటా కోరుతూనే మోహన్ బాబుకు, ఆయన చిన్న కుమారుడు మనోజ్ కూ విభేదాలు వచ్చాయంటారు.

Update: 2024-12-11 12:03 GMT

మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి దీనిపై హోం టూర్ కూడా చేశారు. తన తండ్రికి ఆరు పెద్ద ఇళ్లు ఉన్నాయని ఆమె చెప్పారు

జల్ పల్లి.. జల్ పల్లి.. జల్ పల్లి.. మూడు, నాలుగు రోజుల నుంచి మీడియాలో ఒకటే హడావుడి.. కారణం.. సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబంలో విభేదాలు. ఈ ఇంటిలో వాటా కోరుతూనే మోహన్ బాబుకు, ఆయన చిన్న కుమారుడు మనోజ్ కూ విభేదాలు వచ్చాయంటారు. దీంతో అసలు ఏమిటీ జల్ పల్లి నివాసం? అని ప్రజల్లో విపరీతమైన ఆసక్తి ఏర్పడింది.

అప్పట్లో పది లక్షలు చోరీ

ఈ ఏడాది సెప్టెంబరులో మోహన్ బాబుకు చెందిన జల్ పల్లిలోని నివాసంలో భారీ చోరీ జరిగింది. నగదు, విలువైన బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు తెలుస్తోంది. నాయక్ అనే పనిమనిషి రూ.10 లక్షలు, బంగారు ఆభరణాలతో పారిపోయాడని మోహన్‌ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు గంటల వ్యవధిలోనే కేసును చేధించారు. నాయక్ ను తిరుపతిలో అదుపులోకి తీసుకున్నారు.

మళ్లీ ఇప్పుడు వార్తల్లోకి..

మోహన్ బాబు ఫ్యామిలీ వివాదంతో జల్ పల్లి ఎక్కడ ఉంది? అని అందరూ సెర్చింగ్ మొదలు పెట్టారు. వాస్తవానికి ఇది హైదరాబాద్ శివారు. బెంగళూరు హైవేకు దగ్గరగా శంషాబాద్ శివారులో ఉంది. అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్న శంషాబాద్ పరిసరాల్లోనే మోహన్ బాబు ఈ భారీ భవనాన్ని నిర్మించుకున్నారు.

హైదరాబాద్ రణగొణ ధ్వనులకు దూరంగా మోహన్ బాబు కుటుంబం అంతా ఇక్కడ ఉంటున్నారు. ఆ మధ్య మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి దీనిపై హోం టూర్ కూడా చేశారు. తన తండ్రికి ఆరు పెద్ద ఇళ్లు ఉన్నాయని ఆమె చెప్పారు.

రాజప్రసాదం.. రూ.వంద కోట్లపైనే..

మోహన్ బాబు జల్ పల్లి ఇల్లు చుట్టూ పచ్చటి నేచర్ మధ్య ఉంది. డ్రోన్ షాట్ల ద్వారా చూస్తేనే రెండు స్విమ్మింగ్ పూల్స్ కనిపించాయి. రాజప్రసాదం లాంటి నిర్మాణం ఎటుచూసినా పచ్చదనంతో అలరారుతోంది. లోపల సైతం అద్భుతంగా ఉందీ నిర్మాణం. పైగా శంషాబాద్ ఇప్పుడు బాగా డిమాండ్ ఉన్న ప్రాంతం. మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాయి. దీంతో మోహన్ బాబు జల్ పల్లి నివాసం రూ.100 కోట్లపైనే ఉంటుందని అంటున్నారు. మనోజ్ ఈ బంగ్లాను కోరుతుండడం, కానీ, అతడు భూమా మౌనికను వివాహం చేసుకోవడం నచ్చని మోహన్ బాబు, విష్ణు దూరం పెట్టడంతో అసలు సమస్య వచ్చింది. ఈ బంగ్లా తన కష్టార్జితం అని.. నచ్చినవారికి ఇస్తానని మోహన్ బాబు అంటున్నారు.





 



 



 




Tags:    

Similar News