పాతికేళ్లుగా కిడ్నాప్ చేసి పక్కింట్లోనే బంధించి!

ఒక మనిషిని పాతికేళ్లుగా బంధించడం సాధ్యమేనా? అది ఎవరికి సాధ్యం కాదు.

Update: 2024-05-15 08:53 GMT

ఒక మనిషిని పాతికేళ్లుగా బంధించడం సాధ్యమేనా? అది ఎవరికి సాధ్యం కాదు. కానీ అక్కడ పోలీసులు చెబుతున్నది మాత్రం ఇదే. ఓ వ్యక్తిని ఏకంగా పాతికేళ్ల పాటు గదిలో బంధించి ఉంచడం మామూలు విషయం కాదు. ఆలోచిస్తేనే అంతుచిక్కకుండా అనిపిస్తుంది. అలాంటిది ఓ వ్యక్తిని గదిలో పాతికేళ్లపాటు బంధించారని చెప్పడం నిజంగా అభూతకల్పనే అంటున్నారు.

1998 సంవత్సరంలో దేశంలో అంతర్యుద్ధం కారణంగా అల్లర్లు చెలరేగాయి. ఆ సమయంలో ఆ కుటుంబంలో ఓ వ్యక్తి కనిపించకుండా పోయాడు. ఏదైనా ఊరికి వెళ్లాడో ఏమో అని కొంత కాలం నిరీక్షించారు. కానీ ఎంతకు తిరిగి రాకపోవడంతో చనిపోయాడని అనుకున్నారు. కానీ హఠాత్తుగా ప్రత్యక్షం కావడంతో ఆశ్చర్యానికి లోనవుతున్నారు.

ఇరవై ఆరేళ్లు దాటాక కూడా ఒమర్ బీ వారి ఇంటికి రెండు వందల మీటర్ల దూరంలోని ఇంట్లోనే కనిపించడం అనుమానాలకు తావిస్తోంది. ఒమర్ సోదరుడు దీనికి సంబంధించిన చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వెలుగులోకి వచ్చింది. ఆస్తి పంపకాలు, తగాదాల కేసు కోర్టులో నడుస్తుండగా సమీప బంధువే ఈ కిడ్నాప్ కు పాల్పడినట్లు చెబుతున్నారు.

అల్జీరియాలోని డిజెల్ఫా నగరంలో ఈ దారుణం జరిగింది. కిడ్నాప్ చేసిన నిందితుడు పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు పట్టుకున్నారు. 45 ఏళ్ల వయసులో ఒమర్ ను చూడగానే కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. ప్రస్తుతం అతడి మానసిక స్థితికి చికిత్స అందిస్తున్నారు. పాతికేళ్లుగా పొరుగింట్లోనే బంధించడం నమ్మశక్యంగా లేదని చెబుతున్నారు.

అల్జీరియా ఘటన అందరిని కలచివేస్తోంది. ఒక వ్యక్తిని బంధించి పాతికేళ్లపాటు ఎవరికి కనిపించకుండా చేశారంటే వారు ఎంతటి క్రూరులో అర్థమవుతోంది. కుటుంబానికి అతడిని దూరం చేసి వారు ఏం సాధించారు. ఆ కుటుంబం ప్రేమను తుడిచేశారు. అనురాగాలు లేకుండా చేశారు. వారిపై చట్టరీత్యా కఠిన శిక్షలు వేయాలని పలువురు కోరుతున్నారు.

Tags:    

Similar News