హిట్లర్ ను అరెస్ట్ చేసిన కెనడీ.. 2008లో సంచలనం కలిగించిన హెడ్డింగ్
కొన్నిసార్లు కొన్ని కథనాలు వింతగొలుపుతాయి. ఎవరి గురించో రాస్తే మరెవరో బాధ్యులు కావడం చూస్తుంటాం.
కొన్నిసార్లు కొన్ని కథనాలు వింతగొలుపుతాయి. ఎవరి గురించో రాస్తే మరెవరో బాధ్యులు కావడం చూస్తుంటాం. అచ్చం ఇలాంటి ఘటనే 2008లో మేఘాలయలో జరిగింది. హిట్లర్ ను జాన్ ఎఫ్ కెనడీ అరెస్ట్ చేశారనే వార్త అప్పట్లో సంచలనంగా నిలిచింది. 2008లో మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల్లో అడాల్ఫ్ హిట్లర్ అనే వ్యక్తి పోటీ చేశారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణలతో జాన్ ఎఫ్ కెనడీ అనే పోలీస్ అధికారి అతడిని అరెస్ట్ చేయడంతో ఈ హెడ్డింగ్ సంచలనం కలిగించింది.
ఈ వార్త అప్పట్లో అంతర్జాతీయ మీడియాలో సైతం వైరల్ గా మారింది. కేంద్ర ఎన్నికల సంఘం సామాజిక మాధ్యమాల్లో కూడా పంచుకుంది. హిట్లర్-కెనడీ కథనం హల్ చల్ చేసింది. గతేడాది హిట్లర్ టీఎంసీలో చేరారు. అప్పట్లో ఈ వార్త అందరిలో ఆసక్తి కలిగించింది. హిట్లర్ ను కెనడీ అరెస్ట్ చేయడమేంటనే కోణంలో అందరిలో అనుమానాలు రేకెత్తాయి.
మేఘాలయలో హిట్లర్ అనే వ్యక్తి ఎన్సీపీ తరఫున ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. ఎన్నికల్లో ఆయన ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణలతో ఆయనను అరెస్ట్ చేయడంతో ఈ హెడ్డింగ్ పెట్టారు. రెండు పేర్లు ప్రముఖులవి కావడంతో వార్త కాస్త వైరల్ గా నిలిచింది. అంతర్జాతీయ మీడియా సైతం ఉలిక్కిపడింది. హిట్లర్, కెనడీ కథనం అందరిలో ఆలోచనలు పెంచింది.
హిట్లర్ ను అరెస్ట్ చేసిన అధికారి పేరు కెనడీ. దీంతో వారి పేర్లతోనే హెడ్డింగ్ పెట్టడం సంచలనంగా మారింది. జర్మనీ నియంత హిట్లర్. అమెరికా అధ్యక్షుడుగా పనిచేసిన కెనడీ వీరి కలయిక ఎప్పుడు జరిగింది. హిట్లర్ ను కెనడీ అరెస్ట్ చేయడమేంటనే కోణంలో వాదనలు మొదలయ్యాయి. చివరకు విషయం తెలుసుకుని అందరు నవ్వుకున్నారు. పేర్లలో జరిగిన పొరపాట్ల వల్ల ఇలాంటి వదంతులు పుట్టుకురావడం సహజమే.
వీరి పేర్లతో వచ్చిన హెడ్డింగ్ అప్పట్లో ఎన్నో అనుమానాలకు తావిచ్చింది. వారి పేర్లు పెట్టుకున్న పేర్లు అంతర్జాతీయ సమాజానికి పలు ప్రశ్నలు ఉత్పన్నమయ్యేలా చేసింది. హిట్లర్-కెనడీ కథనం ఇలా ప్రాచుర్యం పొందడం విశేషం. ఒక పేరు కాకుండా రెండు పేర్లు కూడా రెండు భిన్న దేశాలకు చెందిన వారివి కావడంతో ఇలా జరిగినట్లు తరువాత గుర్తించారు.