ప్రపంచంలో అతిపెద్ద సేవాసంస్థల్లో ఒకటి నుంచి వైదొలగిన మెలిందా!
ఈ క్రమంలో ప్రపంచంలోని అతిపెద్ద సేవాసంస్థల్లో ఒకటిగా నిలిచింది "బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్".
ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ధనికులు తమ సంపాదనలో కొంత భాగాన్ని సేవాకార్యక్రమాలకు వినియోగిస్తారనే సంగతి తెలిసిందే! బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ కార్యక్రమాలు ఇంకాస్త ఎక్కువగా ఉంటాయని చెబుతుంటారు. ఈ క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా టాప్ లిస్ట్ లో ఉన్న కుబేరులు నెలకొల్పిన స్వచ్ఛంద సంస్థలు చేసే కార్యక్రమాలు అత్యంత అభినందనీయంగా ఉంటాయి.
ఈ క్రమంలో ప్రపంచంలోని అతిపెద్ద సేవాసంస్థల్లో ఒకటిగా నిలిచింది "బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్". ఈ ఫౌండేషన్ ప్రపంచ వ్యాప్తంగా చేస్తున్న సేవా కార్యక్రమాలు అన్నీ ఇన్నీ కాదు. ఈ సమయంలో ఈ ఫౌండేషన్ లో ఒక బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఇందులో భాగంగా... ఈ ఫౌండేషన్ కో-ఛైర్మన్ పదవికి మెలిందా గేట్స్ రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.
అవును... ప్రపంచ ప్రసిద్ధి చెందిన "బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్" కో-ఛైర్మన్ పదవికి మెలిందా ఫ్రెంచ్ గేట్స్ రాజీనామా చేశారు. తన మాజీ భర్త బిల్ గేట్స్ తో కలిసి ఆమె ఈ స్వచ్ఛంద సంస్థను నెలకొల్పారు. ఈ క్రమంలో సుమారు గత ఇరవై ఏళ్ల వ్యవధిలో ప్రపంచంలో అతిపెద్ద సేవాసంస్థల్లో ఒకటిగా దీన్ని తీర్చిదిద్దారు.
ఈ క్రమంలో సుమారు మూడేళ్ల క్రితం వీరు విడాకులు తీసుకున్నారు. ఈ క్రమంలో సోమవారం "ఎక్స్" వేదికగా స్పందించిన ఆమె... ప్రపంచంలో అసమానతలు తొలగించడానికి ఈ ఫౌండేషన్ చేస్తున్న అసాధారణ కృషి తనకెంతో గర్వకారణమని అన్నారు. బిల్ గేట్స్ తో తాను విడాకులు ప్రకటించిన తర్వాత సంస్థను గణనీయంగా విస్తరించిన సీఈవోను, బోర్డ్ ఆఫ్ ట్రస్టీలను ఆమె కొనియాడారు.
మరోపక్క మెలిందా సేవలకు బిల్ గేట్స్ కృతజ్ఞతలు తెలిపారు. ఇందులో భాగంగా... "బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్" సంస్థను ఆమె విడిచివెళ్లడం విచారకరమే అయినప్పటికీ భవిష్యత్తులో ఆమె సేవారంగంలో ఎంతో ప్రభావం చూపిస్తారని అన్నారు.